మండల కేంద్రానికి బస్సులు నడపండి

ABN , First Publish Date - 2022-09-09T04:31:45+05:30 IST

కొన్నేళ్లుగా రాజంపేట నుంచి వీరబల్లికి బస్సు సౌకర్యం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వీరబల్లి రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ అధ్యక్షుబు దుగ్గనపల్లె సురేంద్రారెడ్డి తెలిపారు.

మండల కేంద్రానికి బస్సులు నడపండి

వీరబల్లి, సెప్టెంబరు 8:  కొన్నేళ్లుగా  రాజంపేట నుంచి వీరబల్లికి బస్సు సౌకర్యం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వీరబల్లి రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ అధ్యక్షుబు దుగ్గనపల్లె సురేంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లా డుతూ మండల ప్రజలు నియోజకవర్గ కేంద్రమైన రాయచోటికి వెళ్లాలంటే  రాయచోటి మీదుగానే వెళ్లాల్సి ఉంటుందని, అందుకు దాదాపుగా మూడు గంటల సమయం పడుతుందన్నారు  సాయంత్రం రాజంపేటలో 7 గంటలకు బస్సుకు బయలుదేరితే, రాయచోటి నుండి వీరబల్లికి వెళ్లే ఆఖరి బస్సు తప్పిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు గ్రామీణుల సౌకర్యార్థం చర్యలు తీసుకోవాలని కోరారు. రాజంపేట నుంచి వీరబల్లికి బస్సు నడిపితే ఎంతో మేలు చేసిన వార వుతారన్నారు. 


Read more