రామనపల్లెలో తాగునీటి సమస్యకు త్వరలో పరిష్కారం

ABN , First Publish Date - 2022-09-18T04:36:22+05:30 IST

రామనపల్లెలో తాగునీటి సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది.

రామనపల్లెలో తాగునీటి సమస్యకు త్వరలో పరిష్కారం

చెన్నూరు, సెప్టెంబరు 17:రామనపల్లెలో తాగునీటి సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది. శనివారం రామనపల్లెలోని బీసీ, ఎస్సీ కాలనీలను ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వినోద్‌కుమార్‌రెడ్డితో పాటు సర్పంచులు స్వప్నం దీపిక, సొంతం నారాయణరెడ్డి, అల్లాడు పాండురంగారెడ్డిలతో కలిసి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మాసిమబాబు పరిశీలించారు. పంచాయతీలో తక్షణ అవసరాల కోసం రెండున్నర లక్షల నిధులను ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ అప్పటికప్పుడు అంచనాలు తయారు చేసి ఉన్నతాధికారులకు తెలిపారు. అందుకు వారు ఫోన ద్వారా ఆమోదం తెలిపినట్లు వారు పేర్కొన్నారు.  

Read more