ప్రొద్దుటూరు పాలకేంద్రం గుర్తుకు లేదా?..: సీపీఐ

ABN , First Publish Date - 2022-12-13T23:28:13+05:30 IST

చిత్తూరులో మూతపడ్డ పాలకేంద్రం తిరిగి ప్రారంభానికి ఆమోదం చెప్పిన ప్రభుత్వానికి సొంతజిల్లాలోని ప్రొద్దుటూరు పాలకేంద్రం కూడా మూతపడిందన్న విషయం గుర్తుకు రాలేదా అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు బి.రామయ్య, పట్టణ కార్యదర్శి పి.సుబ్బరాయుడు నిలదీశారు.

ప్రొద్దుటూరు పాలకేంద్రం గుర్తుకు లేదా?..: సీపీఐ

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 13 : చిత్తూరులో మూతపడ్డ పాలకేంద్రం తిరిగి ప్రారంభానికి ఆమోదం చెప్పిన ప్రభుత్వానికి సొంతజిల్లాలోని ప్రొద్దుటూరు పాలకేంద్రం కూడా మూతపడిందన్న విషయం గుర్తుకు రాలేదా అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు బి.రామయ్య, పట్టణ కార్యదర్శి పి.సుబ్బరాయుడు నిలదీశారు. ఈ మేరకు మంగళవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. కొన్నేళ్ల క్రితమే మూతపడ్డ ప్రొద్దుటూరు పాలకేంద్రంను కూడా తిరిగి ప్రారంభిద్దామన్న ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ పాలకేంద్రం తిరిగి ప్రారంభమైతే నంద్యాల వరకు పాలసేకరణ ఉత్పత్తి పెరిగి జిల్లాలో పాడి అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రొద్దుటూరు పాలకేంద్రం తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమిస్తామని వారు ఆ ప్రకటనలో హెచ్చరించారు.

Updated Date - 2022-12-13T23:28:30+05:30 IST