క్షణికావేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు

ABN , First Publish Date - 2022-09-11T05:23:56+05:30 IST

విద్యా ర్థులు క్షణికావేశంతో తప్పుడు నిర్ణయా లు తీసుకుని భవిష్యత్‌ నాశనం చేసుకో వద్దని ప్రముఖ మానసిక వైద్య నిపుణు లు డాక్టర్‌ రాధిక పేర్కొన్నారు.

క్షణికావేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న డాక్టర్‌ రాధిక

మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 10: విద్యా ర్థులు క్షణికావేశంతో తప్పుడు నిర్ణయా లు తీసుకుని భవిష్యత్‌ నాశనం చేసుకో వద్దని ప్రముఖ మానసిక వైద్య నిపుణు లు డాక్టర్‌ రాధిక పేర్కొన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సంద ర్భంగా స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కళాశా లలో విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రాధిక మాట్లాడుతూ మారుతున్న ఆధునిక సమాజంలో చాలా మంది విద్యార్థులు మొబైల్‌ఫోన్లకు బానిసలుగా మారి విలువైన సమయం వృథా చేయడంతో పాటు ఉజ్వల భవిష్యత్‌ నాశనం చేసుకుంటున్నార న్నారు. డాక్టర్‌ ఉదయ్‌కిరణ్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులు మందలించారనో..తోటి విద్యార్థులు హేళన చేశారనో కొంత మంది విద్యార్థులు, యువత ఆత్మహత్యకు యత్నిస్తుండటం తప్పన్నారు. కార్యక్రమంలో ప్రిన్సి పాల్‌ ఎస్‌.రమాదేవి, సైక్రియా టిస్ట్‌లు అలేఖ్య, గౌతమి, కమాల్‌బాషా పాల్గొన్నారు.

ఒత్తిళ్లతో ఆత్మస్థైర్యం కోల్పోరాదు..

వాల్మీకిపురం, సెప్టెంబరు 10: ఒత్తిళ్లకు లోనై ఆత్మస్థైర్యాన్ని కోల్పోరాదని వాల్మీకిపు రం జనవిజ్ఞాన వేధిక అధ్యక్షుడు ప్రభు చరణ్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆత్మ హత్యల నివారణ దినోత్సవం సందర్భంగా శనివారం జేవీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.   హాస్టల్‌ వార్డెన్‌ భారతి, విద్యార్థులు పాల్గొన్నారు. 

Read more