‘దురదృష్ట సంఘటనలకు ఉపాధ్యాయులను బలి చేయవద్దు’

ABN , First Publish Date - 2022-11-19T00:01:44+05:30 IST

కమలాపురం మండల పరిధిలో మధ్యాహ్న భోజన కార్యక్రమంలో వంట ఏజన్సీ నిర్లక్ష్యంగా ఆకస్మికంగా జరిగిన దుర్ఘటనపై ఉపాధ్యాయులు, ఎంఈవోలను బాధ్యులుగా చేయకూడదని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు.

‘దురదృష్ట సంఘటనలకు ఉపాధ్యాయులను బలి చేయవద్దు’

కడప (ఎడ్యుకేషన), నవంబరు 18 : కమలాపురం మండల పరిధిలో మధ్యాహ్న భోజన కార్యక్రమంలో వంట ఏజన్సీ నిర్లక్ష్యంగా ఆకస్మికంగా జరిగిన దుర్ఘటనపై ఉపాధ్యాయులు, ఎంఈవోలను బాధ్యులుగా చేయకూడదని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. డీఈవో కార్యాలయంలో శుక్రవారం ఏడీకి వారు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంట ఏజన్సీ వారి నిర్లక్ష్యం వల్ల జరిగిన తప్పిదాలకు ఉపాధ్యాయులు, ఎంఈవోలను బాధ్యులను చేయడం సరి కాదని తెలిపారు. మండల ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎన.సరస్వతి, ఎస్‌ఎండీ జాఫర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:01:44+05:30 IST

Read more