-
-
Home » Andhra Pradesh » Kadapa » Do not respond to money requests on social media-MRGS-AndhraPradesh
-
సామాజిక మాధ్యమాల్లో మనీ రిక్వెస్టులకు స్పందించవద్దు
ABN , First Publish Date - 2022-10-12T05:17:23+05:30 IST
సామాజిక మాధ్యమాల్లో జిల్లా కలెక్టర్ పేరుతో ఫేక్ అకౌంట్ ద్వారా డబ్బు అడుగుతు న్నట్లు తన దృష్టికి వచ్చిందనీ, ఇలాంటి తప్పుడు మెస్సేజీలకు ఎవరూ స్పందించవద్దని కలెక్టర్ విజయరామరాజు మంగళవారం ఒక ప్రకట నలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కలెక్టర్ విజయరామరాజు
కడప(కలెక్టరేట్), అక్టోబరు 11: సామాజిక మాధ్యమాల్లో జిల్లా కలెక్టర్ పేరుతో ఫేక్ అకౌంట్ ద్వారా డబ్బు అడుగుతు న్నట్లు తన దృష్టికి వచ్చిందనీ, ఇలాంటి తప్పుడు మెస్సేజీలకు ఎవరూ స్పందించవద్దని కలెక్టర్ విజయరామరాజు మంగళవారం ఒక ప్రకట నలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొవిడ్ మృతుల కుటుంబాలకు కొందరు సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి బ్యాంకు అకౌంట్, పాన్ కార్డు తదితర వివరాలు అడుగుతూ కొంత డబ్బు ఖాతాల్లో నిల్వ ఉండాలనీ, మృతులకు సంబంధించి పరిహారం అందజేస్తా మంటూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. తాజాగా తన పేరుతో డీపీ ఉంచుకుని ఇన్ స్ట్రాగ్రామ్ ఫేక్ అకౌంట్‌తో డబ్బు అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి ఫేక్ అకౌంట్లు, రిక్వెస్టులకు ఎవరూ స్పందించ వద్దని కలెక్టర్ ప్రజలకు, అధికారులకు విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్య మాల్లో ఇలాంటి మెసేజీలు వస్తే తనకు గానీ లేదా కలెక్టర్ కార్యాలయంలో తెలపాలని సూచించారు. సైబర్ నేరాలపై జిల్లా సైబర్ పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఉంచిందని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆ ప్రకటనలో హెచ్చరించారు.