రాష్ట్రంలో లేబర్‌ కోడ్‌లు అమలు చేయవద్దు

ABN , First Publish Date - 2022-09-30T05:25:31+05:30 IST

కేంద్రం కార్మికులకు వ్యతిరేకంగా రూ పొందించిన లేబర్‌ కోడ్‌లను రాష్ట్రంలో అమలు చేయవద్దని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో లేబర్‌ కోడ్‌లు అమలు చేయవద్దు
మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ

మదనపల్లె అర్బన్‌, సెప్టెంబరు29: కేంద్రం కార్మికులకు వ్యతిరేకంగా రూ పొందించిన లేబర్‌ కోడ్‌లను రాష్ట్రంలో అమలు చేయవద్దని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్‌ చేశారు. గురువారం నిర్వ హించిన ఏఐటీయూసీ పట్టణ కార్య వర్గ సమావేశంలో సాంబశివ మాట్లాడు తూ వేతనాలు, పారిశ్రామికం, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని, పరిస్థితుల కోడ్‌ల పై కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. పార్ల మెంట్‌లో చర్చలేకుండానే రాష్ట్రంలో కోడ్‌లు అమలు చేయడం మానుకోవాలన్నారు. పెట్టుబడిదారుల కోసమే ఎన్నో ఏళ్లుగా కార్మిక వర్గం సాధించుకున్న హక్కుల పరిరక్షణకూ కార్మిక వర్గం మరెంతగానో పదును పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కారక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు మస్తాన్‌, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్‌, ఏఐటీయూసీ నాయకులు రెడ్డెప్ప, దేవ, తిరుమల తదితరులు పాల్గొన్నారు. 


Read more