ఇప్పటికైనా న్యాయం చేయండి

ABN , First Publish Date - 2022-04-25T04:51:57+05:30 IST

సరైన వైద్యసేవలు అందక మృతి చెందిన మూడేళ్ల చిన్నారి పల్లవి కేసు విషయమై ఇప్పటికైనా న్యాయం చేయాలని మృతురాలు తండ్రి టి. సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇప్పటికైనా న్యాయం చేయండి
పాత్రికేయులతో మాట్లాడుతున్న చిన్నారి కుటుంబీకులు

బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్‌

కడప, మారుతీనగర్‌, ఏప్రిల్‌ 24: సరైన వైద్యసేవలు అందక మృతి చెందిన మూడేళ్ల చిన్నారి పల్లవి కేసు విషయమై ఇప్పటికైనా న్యాయం చేయాలని మృతురాలు తండ్రి టి. సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ జ్వరం వస్తోందని జనవ రి 16న పెండ్లిమర్రి మండలం నాగాయపల్లె వాసి సుబ్బారెడ్డి కుమార్తె పల్లవిని ఆస్పత్రి లో చేర్పించాడు. అయితే కాంపౌండర్‌, నర్సులే వైద్యం అందించడంతో వైద్యం వికటించి చిన్నారి చనిపోయినవిషయం విదితమే.

అప్పడు నమోదు చేయించిన కేసులో ఇంతవ రకూ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పసిపిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న హాస్పిటల్‌ నిర్వాహకులపై, అలసత్వం వహించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పాప మేనమామలు ఎం. గంగిరెడ్డి, పద్మనాభరెడ్డి, పాల్గొన్నారు. 


Read more