విద్యార్థులకు ఏకాగ్రత ఎంతో అవసరం

ABN , First Publish Date - 2022-12-09T23:43:17+05:30 IST

విద్యార్థులకు ఏకాగ్రత ఎంతో అవసరమని యోగివేమన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన. ఈశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

విద్యార్థులకు ఏకాగ్రత ఎంతో అవసరం
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఈశ్వర్‌రెడ్డి

కడప (కల్చరల్‌), డిసెంబరు 9: విద్యార్థులకు ఏకాగ్రత ఎంతో అవసరమని యోగివేమన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన. ఈశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సీపీ బ్రౌన వర్ధంతిని పురస్కరించుకొని బ్రౌన గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం 8, 9, 10, తరగతుల విద్యార్థులకు హిందూ, ఇస్లాం, క్రైస్తవ గ్రంథాలలోని విషయాల గురించి ధారణ పరీక్షను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన విచ్చేసి మాట్లాడారు. పట్టుదల, ఏకాగ్రత ఆత్మవిశ్వాసం వుంటే ధారణ సాధ్యమన్నారు. సర్వశిక్ష అభియాన ప్రాజెక్ట్‌ అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆటల ద్వారా శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో నాబార్డు మేనేజర్‌ డి. విజయవిహారి, వైవీయూ జియాలజీ విభాగం అధ్యాపకుడు ఆచర్య కె.రఘుబాబు, ఆంగ్ల విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.వి. జయంత కశ్యప్‌, నానో టెక్నాలజీ విభాగం అసోసియేషన ప్రొఫెసర్‌ బి. విజయకుమార్‌, కార్యక్రమంలో బాలవికాస్‌, వివేకానంద, విద్యామందిర్‌, శాంతినికేతన, పీస్‌ ఇస్లామిక్‌, నాగార్జున, పుష్పగిరి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:43:21+05:30 IST