డీకేటీ భూముల అక్రమాలపై ఉద్యమిస్తాం

ABN , First Publish Date - 2022-05-31T05:28:05+05:30 IST

మండలంలో జరిగిన డీకేటీ భూముల అక్ర మాలపై రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు చేపట్టకపోతే ఉద్యమం చేయడానికి సిద్ధమ వుతామని మాలమహానాడు నాయకులు స్పష్టం చేశారు.

డీకేటీ భూముల అక్రమాలపై ఉద్యమిస్తాం

కలికిరి, మే 30: మండలంలో జరిగిన డీకేటీ భూముల అక్ర మాలపై రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు చేపట్టకపోతే ఉద్యమం చేయడానికి సిద్ధమ వుతామని మాలమహానాడు నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దారు రమణి కి వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శనం మాట్లాడుతూ రెవె న్యూ అధికారులు చేసిన అక్రమాల కారణంగా అనేక మంది దళితులు తీవ్రంగా నష్టపో యారని విమర్శించారు. దాదాపు యాభై సర్వే నెంబర్లు తారుమారు చేసి వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారని లక్షలాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. ఆధారాల తో సహా జరిగిన అక్రమాలను అధికారుల దృష్టికి తెచ్చినా న్యాయం చేయడం లేదని ఆరోపించారు. దళిత రైతులందరికీ ఉపయోగపడే సర్వే నంబరు 1098లోని బండను విడగొట్టి ధనికులకు 63 సెంట్లు పట్టా ఇచ్చారని చెప్పారు. దీన్ని రద్దు చేయకపోతే వెంటనే జిల్లా కలెక్టరు కార్యాలయం ముందు నిరసన చేపడుతామన్నారు. ఈ కార్యక్ర మంలో మాలమహానాడు జిల్లా కార్యదర్శులు వై.చంద్రయ్య, ధనయ్య, లోకేశ్వర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు గుండా మనోహర, ఎస్టీడీ హరి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-31T05:28:05+05:30 IST