రైతులకు డ్రిప్పు పరికరాలు పంపిణీ

ABN , First Publish Date - 2022-07-06T05:08:29+05:30 IST

జిల్లాలో 12,600 హెక్టార్లలో 8441 మంది రైతులకు ఏపీ సూక్ష్మనీటి సాగు పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి డ్రిప్పు పరికరాలు మంజూరు చేస్తున్నట్లు ఏపీఎం ఐపీ పీడీ మధుసూదన్‌రెడ్డి తెలి పారు.

రైతులకు డ్రిప్పు పరికరాలు పంపిణీ
డ్రిప్పు, స్ర్పింక్లర్స్‌ను రైతులకు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి

ఎర్రగుంట్ల, జూలై 5: జిల్లాలో 12,600 హెక్టార్లలో 8441 మంది రైతులకు ఏపీ సూక్ష్మనీటి సాగు పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి డ్రిప్పు పరికరాలు మంజూరు చేస్తున్నట్లు ఏపీఎం ఐపీ పీడీ మధుసూదన్‌రెడ్డి తెలి పారు. మంగళవారం ఎర్రగుంట్ల మార్కెట్‌యార్డులో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆద్వర్యంలో రైతులకు డిప్పు పరికరాలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగాజిల్లాకు సంబంధించి మొట్ట మొదటగా జమ్మలమడుగు నియోజవర్గంలోని 144 హెక్టార్లకు గాను 124 మంది రైతులకు ఈ పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీఎంఐపీ పీడీ మాట్లాడుతూ 5 ఎకరాల లోపు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ రైతులకు 90శాతం సబ్సిడీతో రూ.2.18లక్షల వరకు డ్రిప్పు పరికరాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. 5-10ఎకరాల విస్తీర్ణం కలిగిన రైతులకు 70శాతం సబ్సిడీతో రూ.3.40 లక్షల వరకు డిప్పును ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. రైతు పేరుపై ఉన్న భూమిని మాత్రమే ప్రామాణికంగా తీసు కుంటారన్నారు. 5ఎకరాల లోపు ఉన్న రైతులకు 55 శాతం తో, 5-10ఎకరాలు ఉన్న వారికి 45 శాతంతో స్ర్పింక్లర్లు సబ్సిడీతో ఇస్తారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాల చేయూతనిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన వ్యవసాయ ప్రధాన సలహా దారుడు అంబటి క్రిష్ణారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ ప్రధాన సలహా దారుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బాలయ్య, సింగిల్‌విండో అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, ఏడీ నరసింహారెడ్డి, ఏవో అరుణ, రైతు సంఘం నాయకుడు పద్మనాభరెడ్డి,  మాజీ కౌన్సిలర్‌ శివ పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-07-06T05:08:29+05:30 IST