వైసీపీలో అసమ్మతి సెగ

ABN , First Publish Date - 2022-11-08T01:20:46+05:30 IST

ప్రొద్దుటూరులో వైసీపీ నేతల మధ్య అసమ్మతి సెగ రాచుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వైసీపీ నేతలను ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి కలుపుకొని పోకపోవ డంతో వాళ్లంతా ప్రత్యేకంగా జగనన్న బాట సాగిస్తున్నారు.

వైసీపీలో అసమ్మతి సెగ

ప్రొద్దుటూరులో జగనన్న బాట చేపట్టిన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం

ప్రొద్దుటూరు అర్బన్‌, నవంబరు 7: ప్రొద్దుటూరులో వైసీపీ నేతల మధ్య అసమ్మతి సెగ రాచుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వైసీపీ నేతలను ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి కలుపుకొని పోకపోవ డంతో వాళ్లంతా ప్రత్యేకంగా జగనన్న బాట సాగిస్తున్నారు. ఎమ్మెల్యే రాచమల్లు వ్యతిరేక వర్గం కౌన్సిల్లర్లు తమ వార్డులలో గుడ్‌ మార్నింగ్‌ పేరుతో జగనన్న నగర బాటపేర ప్రజల్లోకి వెళ్లి జగన్‌ సంక్షేమ పరిపాలనపై ప్రచారం సాగిస్తున్నారు. వైపీపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరువ అవుతున్నాయా లేదా ఇంకా ఏవైనా సమస్యలున్నాయా అంటూ ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇదివరకే మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఖాజా 12వ వార్డులో, మహ్మద్‌గౌస్‌ 22వ వార్డులో జగనన్నబాట పేర గుడ్‌మార్నింగ్‌ కార్యక్రమం పూర్తి చేశారు. ఇదే బాటలో ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, జిల్లా సర్పంచుల సంఘం అఽధ్యక్షుడు శివచంద్రరెడ్డిల నేతృత్వంలో విజయవంతంగా సాగింది. సోమవారం కౌన్సిల్లరు వంగనూరు మురళీధర్‌ రెడ్డి (మాజీ మున్సిపల్‌ వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌) 5వ వార్డు వైఎంఆర్‌ కాలనీలో గుడ్‌ మార్నింగ్‌ పేరుతో జగనన్న బాట చేపట్టారు. వార్డులో సమస్యలతో ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. ఇప్పటికే ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి తన వ్యతిరేక వర్గంలోని కౌన్సిలర్లయిన మురళీధర్‌ రెడ్డి, వైఎస్‌ చైర్మన్‌ ఖాజా, మహమ్మద్‌ గౌస్‌, మునీర్‌ వార్డులలో భారీ ఎత్తున ఇతర వార్డు కార్యకర్తలను, పార్టీ శ్రేణులను తరలించి విందు భోజనాలు సైతం ఏర్పాటు చేసి పోటీగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి చేశారు. దీన్ని ప్రతిష్టగా తీసుకున్న ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం అంతా కలిసికట్టుగామళ్లీ తమ వార్డులలో జగనన్న బాట పేర ప్రజల్లోకి వెళుతున్నారు. వీరికి వార్డు ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తోంది. స్థానికులై వుండటం, కౌన్సిల్లర్‌గా తమ వార్డుకు ప్రజలు ఎన్నుకున్న వారు కావడంతో వారిని ప్రజలు ఆదరిస్తున్నారు.

Updated Date - 2022-11-08T01:20:50+05:30 IST