3 నుంచి వైవీయూ పీజీ కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు

ABN , First Publish Date - 2022-12-30T23:16:24+05:30 IST

యోగివేమన విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ కళాశాలల్లో పీజీ కోర్సులు నేరుగా ప్రవేశాల కోసం జనవరి 3 నుంచి 6 వరకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు యూనివర్శిటీ ప్రవేశాల సంచాలకులు ప్రొఫెసర్‌ కంకణాల గంగయ్య తెలిపారు.

3 నుంచి వైవీయూ పీజీ కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు

కడప (ఎడ్యుకేషన్‌), డిసెంబరు 30: యోగివేమన విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ కళాశాలల్లో పీజీ కోర్సులు నేరుగా ప్రవేశాల కోసం జనవరి 3 నుంచి 6 వరకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు యూనివర్శిటీ ప్రవేశాల సంచాలకులు ప్రొఫెసర్‌ కంకణాల గంగయ్య తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్‌, రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలు, నిర్ణీత ఫీజుతో విశ్వవిద్యాలయంలోని ఏపీజే అబుల్‌కలాం ప్రాంగణం లో గల ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ పోస్టుగ్రాడ్యుయషన్‌ కామర్స్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ పీజీ సెట్‌) 2022 రాసి అర్హత సాధించి ఉన్న అభ్యర్థులు మాత్రమే ప్రవేశాల కౌన్సిలింగ్‌కు అర్హులన్నారు.

Updated Date - 2022-12-30T23:16:24+05:30 IST

Read more