పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ

ABN , First Publish Date - 2022-10-02T05:11:34+05:30 IST

కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్‌కుమా ర్‌ దువ్వూరు పోలీ సు స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్‌ పరిసరాలను, రికార్డులను పరిశీలించారు.

పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ
పోలీసు స్టేషన్‌ను పరిశీలిస్తున్న డీఐజీ

దువ్వూరు, అక్టోబరు 1: కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్‌కుమా ర్‌ దువ్వూరు పోలీ సు స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్‌ పరిసరాలను, రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌ నిర్వహణ, రిసెప్షన్‌లో పోలీసు స్టేషన్‌కు వచ్చేవారితో ప్రవర్తించే తీరుపై సిబ్బందికి సూచించారు. పెండింగ్‌ కేసులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సచివాలయ మహిళా కానిస్టేబుళ్లతో మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌, సీఐ నరేంద్రారెడ్డి, ఎస్‌ఐలు కేసీ రాజు, డాక ్టర్‌ నాయక్‌, విద్యాసాగర్‌ పాల్గొన్నారు.

Read more