-
-
Home » Andhra Pradesh » Kadapa » Devotees visit Tirumala in free buses-MRGS-AndhraPradesh
-
ఉచిత బస్సుల్లో భక్తులకు తిరుమల దర్శనం
ABN , First Publish Date - 2022-09-28T04:34:45+05:30 IST
ఉచిత బస్సుల్లో భక్తులకు తిరుమల దర్శనం

ఒంటిమిట్ట, సెప్టెంబరు27: భక్తులకు సనాత న ఫౌండేషన్ అధ్వర్యంలో తిరుమల బ్రహ్మో త్సవాల్లో భాగంగా వేంకటేశ్వరస్వామి దర్శనా ర్ధం ఉచితంగా ఐదు బస్సులను స్థానిక కోదం డరామాలయం నుంచి మంగళవారం టీటీడీ అధికారులు ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల్లో దళితవాడల్లోని దళితులకు ఉచితంగా స్వామి వారి దర్శనాన్ని కల్పించాలనే సదుద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు. ఆధ్యాత్మిక భావంతో భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని భాగ్యం కలగాలని బస్సు లు ఏర్పాటు చేశారని తెలిపారు. టీటీడీ ఇన్‌స్పెక్టర్ ధనుంజయులు, అర్చకులు పాల్గొన్నారు.