-
-
Home » Andhra Pradesh » Kadapa » Demolition of houses should be stopped immediately-MRGS-AndhraPradesh
-
ఇళ్లను కూల్చడం తక్షణమే ఆపాలి
ABN , First Publish Date - 2022-07-19T05:07:35+05:30 IST
కడప నగరంలో పేదలు నివసిస్తున్న ప్రాంతాలలో కాలువలు, విస్తరణ పేరుతో ఏళ్లకు ఏళ్లుగా సంసారం ఉన్న ఇళ్లను కూల్చడం తక్షణమే ఆపాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) , సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.రామమోహన్, రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ (ఆర్సీపీ) నగర కార్యదర్శి మక్బూల్ బాషాలు సంయుక్తంగా డిమాండ్ చేశారు.

కడప(సెవెన్రోడ్స్), జూలై 18 : కడప నగరంలో పేదలు నివసిస్తున్న ప్రాంతాలలో కాలువలు, విస్తరణ పేరుతో ఏళ్లకు ఏళ్లుగా సంసారం ఉన్న ఇళ్లను కూల్చడం తక్షణమే ఆపాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) , సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.రామమోహన్, రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ (ఆర్సీపీ) నగర కార్యదర్శి మక్బూల్ బాషాలు సంయుక్తంగా డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆర్కేనగర్ ప్రజలతో కలిసి పేదలి ఇళ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ మోకాళ్ల పై కూర్చొని నిరసన తెలుపుతూ మౌనదీక్షను చేపట్టారు. స్పందించిన ఆర్డీవో మాట్లాడుతూ పేదలకు ఇబ్బంది కలిగే ఏ పని ప్రభుత్వం చేయదని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఎవరికీ ఎటువంటి నష్టం లేకుండా చూస్తామని ఆయన వివరణ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఐఎన్.సుబ్బమ్మ, పార్టీ జిల్లా సభ్యులు పాపిరెడ్డి, చంద్రారెడ్డి, దస్తగిరిరెడ్డి, ఓబులేసు, ఆర్సీపీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుబ్బారాయుడు, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.