డీసీసీబీ అసిస్టెంట్‌ మేనేజర్‌ డిస్మిస్‌

ABN , First Publish Date - 2022-06-11T06:00:45+05:30 IST

కడప డీసీసీ బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ రవిచంద్రరాజును గురు వారం రాత్రి ఉద్యో గం నుంచి డిస్మిస్‌ చేశారు. ఆయన కమలాపురం డీసీ సీబీ బ్రాంచ్‌ ఇన్చార్జిగా ఉన్న ప్పుడు తప్పుడు డాక్యు మెంట్లతో రూ.29 లక్షల రుణాలు ఇచ్చారని ఎంక్వయిరీ కమిటీ రిపోర్టు ఇవ్వడంతో డిస్మస్‌ చేస్తున్నట్టు సీఈవో ఎస్‌.విజయభాస్కర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయి తే ఈ కేసులో తనను ఒక్కడినే బలిపశువును చేశారని, రిటైర్‌ మెంట్‌ సమయంలో ఇలా చేయ డంతో తనకు అన్యాయం జరిగం దంటూ ఆయన కోర్టును ఆశ్ర యించారు. విశ్వసనీయ సమా చారం మేరకు వివరాలు ఇలా..

డీసీసీబీ అసిస్టెంట్‌ మేనేజర్‌ డిస్మిస్‌
విధుల నుంచి తొలగించబడిన రవిచంద్రరాజు

రిటైర్మెంట్‌ సమయంలో పదవి నుంచి తొలగింపు

హైకోర్టును ఆశ్రయించిన అసిస్టెంట్‌ మేనేజర్‌

తప్పుడు డాక్యుమెంట్లతో రూ.29 లక్షల రుణాలు

కమలాపురం బ్రాంచ్‌లో వ్యవహారం

చక్రం తిప్పిన స్థానిక నేత

కడప(రూరల్‌), జూన్‌ 10: కడప డీసీసీ బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ రవిచంద్రరాజును గురు వారం రాత్రి ఉద్యో గం నుంచి డిస్మిస్‌ చేశారు. ఆయన కమలాపురం డీసీ సీబీ బ్రాంచ్‌ ఇన్చార్జిగా ఉన్న ప్పుడు తప్పుడు డాక్యు మెంట్లతో రూ.29 లక్షల రుణాలు ఇచ్చారని ఎంక్వయిరీ కమిటీ రిపోర్టు ఇవ్వడంతో డిస్మస్‌ చేస్తున్నట్టు సీఈవో ఎస్‌.విజయభాస్కర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయి తే ఈ కేసులో తనను ఒక్కడినే బలిపశువును చేశారని, రిటైర్‌ మెంట్‌ సమయంలో ఇలా చేయ డంతో తనకు అన్యాయం జరిగం దంటూ ఆయన కోర్టును ఆశ్ర యించారు. విశ్వసనీయ సమా చారం మేరకు వివరాలు ఇలా..

సిద్దవటం మండలంలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న రవిచంద్రరాజును 2016లో కమలాపురం డీసీసీబీ బ్రాంచ్‌కు బదిలీచేసి ఇన్‌చార్జ్‌ బ్యాంకు మేజర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో ఇటు బ్యాంకుద్వారా అటు సొసైటీల ద్వారా రైతులకు దాదాపు రూ.40 కోట్లు రుణాలను అందించారు. ఈ వ్యవహారంలో ఓ స్థానిక నాయకుడు చక్రం తిప్పాడు. ఆయన అలోచనలకు అధికారుల సహకారం తోడు కావడంతో ఐదుగురి పేరుమీద తప్పుడు డాక్యుమెంట్లు, నకిలీ ఫొటోలు, నకిలీ ఆధార్‌ కార్డులతో రుణాలకు దరఖాస్తు చేయించారు. ఈ పత్రాలను ఇక్కడి అధికారులు ముందస్తు ఒప్పందం ప్రకారం మార్టిగేజ్‌ చేయకుండా వచ్చినవి వచ్చినట్లే బ్యాంకు హెడ్‌ ఆఫీసుకు సిఫారసు చేశారు. ఆ తరువాత ఈ అకౌంట్లకు దాదాపు రూ.29 లక్షల రుణాలను జమచేశారు. అనంతరం ఇక్కడి అకౌంట్ల నుంచి తెల్లచొక్కా నేత బంధువుల అకౌంట్‌కు డబ్బు చకచకా ట్రాన్స్‌ఫర్‌ అయిపోయింది. 

   రుణాలు మంజూరైన అకౌంట్ల నుంచి చిల్లిగవ్వ కూడా బ్యాంకుకు జమకాకపోవడంతో చేసిన మోసం బట్టబయలైంది. ఈ వ్వవహారంపై 2021లో ఎంక్వయిరీ కమిటీని వేశారు. ఈ కమిటీలో ఉన్నది సదరు రూ.29 లక్షల రుణాలను మంజూరు చేసిన అధికారుల టీమ్‌లోని వారే ఉండడం విశేషం. రుణాల మంజూరుకు అప్పటి ఇన్‌చార్జ్‌ బ్యాంకు మేనేజర్‌ రవిచంద్రరాజు తప్పిదమే కారణమని ఉన్నతాధికారులకు ఎంక్వయిరీ టీమ్‌ నివేదిక సమర్పించింది. (రుణాల మంజూరులో కీలకంగా వ్యవహరించిన తెల్లచొక్కా నాయకుడు ప్రస్తుతం డీసీసీబీలో చెప్పుకోదగ్గ పదవిలో కొనసాగుతున్నారు.) సదరు నివేదిక ఆధారంగా రవిచంద్రరాజును అప్పట్లో సస్పెండ్‌ చేశారు. తరువాత కొన్ని షరతులతో తిరిగి ఆయనను విధుల్లోకి తీసుకొని రూ.29 లక్షలు రికవరీ చేయాలని ఆదేశించారు. అయితే.. తప్పుడు డాక్యుమెంట్ల పేరుతో రుణాలను పొందారని వీటిని రికవరీ చేయడానికి వీలుపడడంలేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే రుణాలను రికవరీ చేయక పోవడంతో పాటు ఎంక్వయిరీ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కడప డీసీసీబీ అసిస్టెంట్‌ మేనేజర్‌ రవిచంద్రరాజును జూన్‌ 9న పదవి నుంచి తొలగిస్తూ సీఈవో ఎస్‌.విజయభాస్కర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.


సీఐడీ విచారణ జరపాలి

- రవిచంద్రరాజు, అసిస్టెంట్‌ మేనేజర్‌

తప్పుడు డాక్యుమెంట్లపై రుణాల మంజూరులో బాధ్యులైన అఽధికారులనే విచారణ అధికారులుగా వేసి నాకు తీవ్ర అన్యాయం చేశారు. రుణాల మంజూరుకు ఏవైతే డాక్యుమెంట్లు ఇచ్చారో అవన్నీ హెడ్‌ ఆఫీసుకు సిపారస్సు చేశాను. నాకు పలానా వ్యక్తులు డాక్యుమెంట్లు ఇచ్చారని చెప్పినా వారి జోళికి వెల్లడంలేదు. ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా మానసికంగా వేధించి చివరికి డిస్మిస్‌ చేశారు. ఈ మోసంలో మిగిలిన వారందరిని వదిలేసి నన్ను కావాలనే దోషిని చేశారు. బ్యాంకు నిబంధనల ప్రకారం బ్రాంచ్‌ మేనేజర్‌కు రుణాలు మంజూరుచేసే అధికారం లేదు. విచారణ అధికారులే నిధుల మంజూరులో బాధ్యులై ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి విచారణ చెల్లదని హైకోర్టులో రిట్‌పిటీషన్‌ దాఖలు చేశా. హైకోర్టు సద రు కేసును జూలై 4కు వాయి దా వేసి విచారణ అధికారులకు, సీఈవోకు నోటీసులు పంపింది. కోర్టు నిర్ణయం వెలువడక ముందే నాపై సీఈవో చర్యలు తీసుకోవడం కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుంది. కలెక్టర్‌ ఈ వ్వవహారంపై స్పందించి సహకారశాఖ ఉన్నతాధికారులతోగానీ, సీఐడీ లేక పోలీసులతో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.


రవిచంద్రరాజు ఆరోపణలన్నీ ఆసత్యాలే 

- ఎస్‌.విజయభాస్కర్‌రెడ్డి, డీసీసీబీ సీఈవో

డీసీసీ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న రవిచంద్రరాజు చేస్తున్న ఆరోపణలన్నీ ఆసత్యాలే. ఆయన 2016-17లో కమలాపురం డీసీసీబీ బ్రాంచ్‌ ఇన్‌చార్జ్‌ మేనేజర్‌గా ఉన్న సమయంలో మంజూరు చేసిన రుణాలలో రూ.29 లక్షలు తప్పుడు డాక్యుమెంట్ల రూపంలో మంజూరు చేసినట్టు ఎంక్వయిరీ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ మేరకు ఆయన సదరు రుణాలను రికవరీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పదవి నుంచి డిస్మిస్‌ చేశాం.

Updated Date - 2022-06-11T06:00:45+05:30 IST