దర్జాగా కబ్జా..?!

ABN , First Publish Date - 2022-12-30T23:54:31+05:30 IST

మండలంలో ప్రభుత్వ భూము లు దర్జాగా కబ్జా అవుతున్నా పట్టించుకునే నాథుడే కరు వయ్యాడు. ఈ కబ్జాలకు అటు రెవెన్యూ.. ఇటు పోలీసు ల అండదండలు ఉండడంతో కబ్జాదారులు రెచ్చిపోతు న్నారనే విమర్శలున్నాయి.

దర్జాగా కబ్జా..?!
బోర్డును తొలగించి ఎక్సకవేటర్‌తో పనులు చేస్తున్న కబ్జాదారులు

నిన్న ప్రభుత్వ భూమి.. నేడు రైతు భూమిగా మార్పు

రెవెన్యూ అధికారుల మాయాజాలం

పోలీసు బందోబస్తు నడుమ భూమి చదును

కలకడ, డిసెంబరు 30: మండలంలో ప్రభుత్వ భూము లు దర్జాగా కబ్జా అవుతున్నా పట్టించుకునే నాథుడే కరు వయ్యాడు. ఈ కబ్జాలకు అటు రెవెన్యూ.. ఇటు పోలీసు ల అండదండలు ఉండడంతో కబ్జాదారులు రెచ్చిపోతు న్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూమిని ఎక్సకవేటర్‌ సాయంతో బండ రాళ్లను తొలగిం చి చదును చేస్తుండడం గమనార్హం. కాగా గురువారం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలమంటూ ఓ చోట బోర్డును ఏర్పాటు చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే ఈ భూమి రైతు భూమిగా మారడం విశేషం. ఈ ప్రభు త్వ భూమిని చదును చేయడానికి పోలీసులు దగ్గరుండి బందోబస్తు కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కలకడ మండలం కదిరాయచెరువుకు చెంది న సర్వే నెంబరు 344/1లో 1.42 ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి ప్రభుత్వానిదే అంటూ కలకడ తహశీల్దార్‌ రాము, ఎస్‌ఐ తిప్పేస్వామి ఆధ్వర్యంలో గు రువారం సిబ్బంది బోర్డును ఏర్పాటు చేశారు. ఈ భూమి లో ఎవరూ ప్రవేశించరాదని, ప్రవేశిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వ భూ మిలో నిన్నటి వరకు ఎవరూ ప్రవేశించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూమిపై కన్నేసిన కబ్జాదారుడు రాత్రికి రాత్రే రాజకీయంగా చక్రం తిప్పాడు. ఇంకేముంది తెల్లవారేసరికి ప్రభుత్వ భూమిలో ఎక్సకవేటర్లను ఉంచి చదును చేయడం ప్రారంభించాడు. ఈ ఆక్రమణలకు అటు రెవెన్యూ.. ఇటు పోలీసులు దగ్గరుండి పనులను పర్యవేక్షించడం విశేషం.

రాత్రికి రాత్రే రికార్డుల మారాయా..?

కదిరాయచెరువు సర్వే నెంబరు 344/1లో 1.42 ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉంది. ఇది ప్రభుత్వ భూమే అంటూ ఆగమేఘాలపై రెవెన్యూ అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు. రాత్రికిరాత్రే ఏం జరిగిందో తెలియదుకానీ ఉద యానికి రెవెన్యూ అధికారులే బోర్డును తొలగించారు. అంతేకాకుండా ప్రభుత్వ భూమిలో ఓ మోతుబరి రైతు ఎక్సకవేటర్‌ ఉంచి భూమి చదును చేయడం ప్రారంభిం చాడు. ఈ ఆక్రమణకు పోలీసులే రక్షణగా ఉండడంతో ప్రశ్నించడానికి ఎవరూ ముందుకు రాలేదని పలువురు అంటున్నారు. ప్రభుత్వభూమిని కాపాడాల్సిన అధికారులే కబ్జాదారులకు సహకారం అందించడం కొసమెరుపు.

రికార్డులను పరిశీలించి చర్యలు..

కదిరాయచెరువులోని సర్వే నెంబరు 344/1లోని 1.42 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను పరిశీ లించి, అది ప్రభుత్వ భూమా కాదా అన్న విషయం నిర్ధారిస్తాం. ఆ తరువాతే చర్యలు తీసుకొంటాం. అప్పటి వరకు భూమిలో ఎటువంటి పనులు జరగకుండా తగు చర్యలు తీసుకొంటాం.

- రాము, తహశీల్దార్‌, కలకడ

గొడవలు జరగకుండా బందోబస్తు..

కదిరాయ చెరువులో రెవెన్యూ అధికారులు బోర్డు ఏ ర్పాటు చేసిన స్థలంలో శుక్రవారం పనులు చేస్తున ట్లు సమాచారం రావడంతో తమ సిబ్బందిని అక్కడి కి పంపాం. గ్రామంలో ఎటువంటి గొడవలు జరగ కుండా ఉండేందుకే ముందస్తుగా సిబ్బందిని అక్కడ బందోబస్తుగా ఉంచాం.

- తిప్పేస్వామి, ఎస్‌ఐ, కలకడ

Updated Date - 2022-12-30T23:54:31+05:30 IST

Read more