దంపతులపై కొడవళ్లతో దాడి

ABN , First Publish Date - 2022-08-22T04:54:09+05:30 IST

భూవివాద గొడవ ల్లో భాగంగా కొందరు వ్యక్తులు దంపతులపై కొడవళ్లతో దాడి చేశా రు. కురబలకోట మండ లం అంగళ్లు పంచాయ తీ తుమ్మచెట్లపల్లెకు చెందిన వెంకట్రమణ (55), గంగుల మ్మ(50)దంపతులు వ్యవసాయం చేస్తుండేవారు.

దంపతులపై కొడవళ్లతో దాడి

మదనపల్లె క్రైం, ఆగస్టు 21: భూవివాద గొడవ ల్లో భాగంగా కొందరు వ్యక్తులు దంపతులపై కొడవళ్లతో దాడి చేశా రు. కురబలకోట మండ లం అంగళ్లు పంచాయ తీ తుమ్మచెట్లపల్లెకు చెందిన వెంకట్రమణ (55), గంగుల మ్మ(50)దంపతులు వ్యవసాయం చేస్తుండేవారు. ఈనేపథ్యం లో వెంకట్రమణ, అదే గ్రామానికి చెందిన రెడ్డెప్ప కుటుంబాల మఽధ్య కొద్దిరోజులుగా భూవి వాదాలు జరుగుతున్నాయి. దీంతో  ఆదివారం ఇరువర్గాల వారు మాటామాటా పెంచుకుని గొడవ కు దిగారు. ఆవేశానికి గురైన రెడ్డెప్ప, అతని అనుచరులు మరి కొందరు కలసి దంపతులపై కొడవళ్లతో దాడి చేశారు. గాయప డిన వారిని స్థానికులు 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్ప త్రికి తరలించారు. ఈ మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ముదివే డు పోలీసులు చెప్పారు.

రైలు కింద పడి వృద్ధుడు మృతి


కురబలకోట, ఆగస్టు 21: రైలు కింద పడి రెడ్డిబాషా (59) అనే వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఆదివా రం మండలంలో జరిగింది. మండలంలోని కురబలకోట ప్రశాంత్‌ నగర్‌కు చెందిన కె.వల్లీ సాహెబ్‌ కుమారుడు రెడ్డిబాషా చిత్తుకాగితాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఇతని భార్య ఇటీవల కువైట్‌కు వెళ్లింది. ఇతడిని పట్టించు కునే వారు లేకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. దీంతో మండలంలోని దిగువబో యపల్లెకు వెళ్లే మార్గమధ్యంలో 6.00 గంటల సమయంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మార్గాన వెళ్లే గ్రామస్థులు గమనించి కుటుంబీకులకు, కదిరి రైల్వే పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి మృత దేహాన్ని చూసి కుటుంబీకులు భోరున విలపించారు. కాగా పోస్టు మార్టం నిమిత్తం మృతదేహా న్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కదిరి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Read more