‘కార్పొరేట్‌’ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలు

ABN , First Publish Date - 2022-06-08T04:47:45+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన బడి నాడు-నేడుతో అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్‌ సంస్ధలను తలదన్నేలా ప్రభుత్వ పాఠ శాలలు రూపుదిద్దుకున్నాయని కలెక్టర్‌ పీఎస్‌ గిరీష పేర్కొన్నారు.

‘కార్పొరేట్‌’ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలు
నాడు-నేడు పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే, జాయింట్‌ కలెక్టర్లు

రాయచోటి టౌన్‌, జూన్‌ 7: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన బడి నాడు-నేడుతో అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్‌ సంస్ధలను తలదన్నేలా ప్రభుత్వ పాఠ శాలలు రూపుదిద్దుకున్నాయని కలెక్టర్‌ పీఎస్‌ గిరీష పేర్కొన్నారు. మంగళవారం మన బడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ది చేసిన రాయచోటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా, ఎమ్మెల్యే గడికోట శ్రీకాం త్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌  అన్సా రి యా సందర్శించారు. ఈ సందర్భంగా వారు మ న బడి నాడు-నేడు  కార్యక్రమం ద్వారా పాఠ శాలలో చేపట్టిన అభివృద్ది పనులు, ఆర్వో వాట ర్‌ ప్లాంట్‌, మరుగుదొడ్లను పరిశీలించారు. అందులో భాగంగానే పాఠశాలలో నెలకొన్న  సమస్యలను ఆరా  తీశారు. పాఠశాల ఆవరణ లోని క్రీడా మైదానంలో ఆకతాయిలు, మందు బాబులు విద్యార్ధినులను ఇబ్బం దులు పెడుతు న్నారని పాఠశాల ఉపా ధ్యాయులు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకొ చ్చారు. ఆకతాయిలు, మందు బాబుల పాఠశాల ఆవరణలోకి రానీ యకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని రాయచోటి అర్బన్‌ సీఐ సుధా కర్‌ రెడ్డిని జిల్లా కలెక్టర్‌ ఆదేశిం చారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా మాట్లాడుతూ విద్యపైనే దేశ భవిష్యత్తు ఆధా రపడి ఉందని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. మనబడి నాడు- నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నార న్నారు. దీంతో పేద విద్యార్ధులు సర్కా రు బడుల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు.  ము ఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి విద్యారంగం అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధి నాడు-నేడు పనుల్లో కనిపిస్తోందన్నారు. ఎమ్మె ల్యే  గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగానికి ప్రాధాన్యమిస్తూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక, వసతిదీవెన, విద్యాదీవెన, గోరుముద్ద, వంటి పధకాలు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నాయన్నారు.పాదయాత్ర సం దర్భంగా శిథిలావస్ధలో ఉన్న పాఠశాలలను స్వ యంగా చూసిన వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి అధి కారంలోకి రాగానే పాఠశాలల అభివృద్దికి ఆదేశా లు జారీ చేశారన్నారు. నాణ్యతలో రాజీ లేకుం డా మనబడి నాడు-నేడు పనులను చేయించా రన్నారు. మరుగుదొడ్లలో వాడే పరిక రాలు, ప్యా న్లు, ట్యూబ్‌లైట్లు ప్రముఖ కంపెనీలవే  అమ ర్చారన్నారు.  నిర్మాణ పనుల్లోనూ పది కాలాల పాటు నిలిచి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా రు.  స్థానిక ప్రజాప్రతి నిధులు, ఉపాద్యాయు లు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-08T04:47:45+05:30 IST