కరోనా అట్‌ 2031

ABN , First Publish Date - 2022-01-28T05:38:57+05:30 IST

కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. చాపకింద నీరులా మెల్లగా జిల్లా అంతా చుట్టేస్తోంది. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని చోట్లా వైరస్‌ తిష్టవేసింది. గురువారం ఒక్కరోజే 2031 కేసులు నమోదయ్యాయి.

కరోనా అట్‌ 2031

విచ్చలవిడిగా తిరిగేస్తున్న జనం 

ఎవ్వరిలోనూ కానరాని భయం

కడప, జనవరి 27(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. చాపకింద నీరులా మెల్లగా జిల్లా అంతా చుట్టేస్తోంది. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని చోట్లా వైరస్‌ తిష్టవేసింది. గురువారం ఒక్కరోజే 2031 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే కరోనా కేసులు నమోదులో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. మహమ్మారి విజృంభిస్తున్న ప్పటికీ జనంలో భయం కరువైంది. భౌతికదూరం పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరిగే స్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా గుమికూడుతున్నారు. వాణిజ్య సంస్థలు, ప్రధాన ప్రాంతాల్లో నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు.


8 రోజుల్లో 8,366 పాజిటివ్‌ కేసులు

జిల్లాలో 8 రోజుల వ్యధిలోనే 8,366 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటే వ్యాఽధి వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇక బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 3,331 కరోనా పరీక్షలు నిర్వహించగా 2031 మందిలో వైరస్‌ నిర్ధారణ అయింది. ఒక్క రోజులోనే కరోనా 2 వేల మార్కు దాటడం ఆందోళన కలిగించే పరిణామమే. ఒక్క కడప నగరంలోనే 600 కేసులు నమోదయ్యాయి. 86 మంది ఆస్పత్రిలో, 31 మంది కేర్‌ సెంటర్‌లో, హోం ఐసోలేషనలో 7,564 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న 657 మందిని డిశ్చార్జ్‌ చే శారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,26,709 మంది కరోనా బారినపడగా 716 మంది మృతిచెందారు. కరోనా నుంచి  1,21,319 మంది కోలు కున్నారు. కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నా ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య నామమాత్రంగా ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఎక్కువ శాతం హోం ఐసోలేషనలో చికిత్స పొందుతున్నారు. 


8 రోజులుగా నమోదైన కేసులు

తేదీ కేసులు


20 685

21 649

22 734

23 785

24 1492

25 1083

26 907

27 2031

Read more