కడపలో ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలి

ABN , First Publish Date - 2022-02-17T04:32:52+05:30 IST

కడపలో ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా సహాయ కార్యదర్శి వి. రవి, డీవైఎ్‌ఫఐ పట్టణ కార్యదర్శి ఓ.పుల్లయ్య పేర్కొన్నారు.

కడపలో ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలి

బద్వేలు, ఫిబ్రవరి 16: కడపలో ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా సహాయ కార్యదర్శి వి. రవి, డీవైఎ్‌ఫఐ పట్టణ కార్యదర్శి ఓ.పుల్లయ్య పేర్కొన్నారు. బుధవారం ఎంవీఎ్‌సఆర్‌ ప్రైవేటు కళాశాల ఆవరణలో ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ సంయుక్త ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ మండల కార్యదర్శి భాను ప్రకాష్‌, మండల  కార్యకర్త పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో....

జిల్లాలో  ఉక్కు పరిశ్రమకు శ్రీకారం చుట్టాలని ఏఐవైఎఫ్‌ ఏరియా కార్యదర్శి అనిల్‌కుమార్‌ పేర్కొన్నా రు. సీపీఐ కార్యాలయం జేవీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం అని, ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చిన జగన్‌ నేడు ఉక్కు పరిశ్రమ ఊసే పట్టించుకోవడం లేదన్నారు. ఏవైఎ్‌ఫఐ పట్టణ ఉపాధ్యక్షుడు గిరి, విజయ్‌ పాల్గొన్నారు.

Read more