సమస్యలపై నిరంతర పోరాటం

ABN , First Publish Date - 2022-07-06T04:32:22+05:30 IST

నియోజకవర్గ సమస్యలపై సీపీఐ నిరంతర పోరాటాల కు సిద్ధమౌతోందని రైల్వేకోడూరు సీపీఐ ఏరియా కార్యదర్శి తుమ్మల రాధాక్రిష్ణ య్య తెలిపారు.

సమస్యలపై నిరంతర పోరాటం
సమావేశంలో మాట్లాడుతున్న రాధాక్రిష్ణయ్య

ఏరియా కార్యదర్శి తుమ్మల రాధాక్రిష్ణయ్య

రైల్వేకోడూరు, జూలై 5: నియోజకవర్గ సమస్యలపై సీపీఐ నిరంతర పోరాటాల కు సిద్ధమౌతోందని రైల్వేకోడూరు సీపీఐ ఏరియా కార్యదర్శి తుమ్మల రాధాక్రిష్ణ య్య తెలిపారు. రైల్వేకోడూరు సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టోల్‌గేట్‌ వద్ద ప్రజలకు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడు తున్నారన్నారు. రైల్వే అండర్‌ బ్రిడ్జి లేక 25 గ్రామాల ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పట్టణంలో సక్రంగా డ్రైనేజీ ఏర్పాటు లేక వర్షా కాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజా సమస్యలను వైసీపీ గాలికి వదిలేసిందన్నారు. సమావేశంలో మండ ల కార్యదర్శులు దార్ల రాజశేఖర్‌, ఆదినారాయణ, ఏఐటీయూసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రెటరీ పోకూరు మురళీ, సీపీఐ నేతలు కే. ప్రసాద్‌, మణి, మురళి తదితరులు పాల్గొన్నారు.


Read more