మహాసభలను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2022-07-06T04:36:09+05:30 IST

బద్వేలు ఏరియా మహాసభలు 25, 26వతేదీల్లో జరుగుతాయని వాటిన జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్‌, ఏరియా కార్యదర్శి జకరయ్య పేర్కొన్నారు.

మహాసభలను జయప్రదం చేయండి

పోరుమామిళ్ల,  జూలై 5 :బద్వేలు ఏరియా మహాసభలు 25, 26వతేదీల్లో జరుగుతాయని వాటిన జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్‌, ఏరియా కార్యదర్శి జకరయ్య పేర్కొన్నారు. మంగళవారం పోరుమామిళ్లలో సీపీఐ మండల విస్తృత స్థాయి  సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు చేస్తున్నాయని వాటిపై ప్రతి కామ్రేడ్‌ ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సైనికుల్లా పని చేయాలన్నారు. 19న మండల మహాసభ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి రవికుమార్‌, పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్‌, కేశవ, బెల్లంబాషా, రేణుకమ్మ, షాహిదా పాల్గొన్నారు. 

Read more