వైవీయూలో కంప్యూటర్‌ సైన్స్‌ భవనాలు అందుబాటులోకి: వీసీ

ABN , First Publish Date - 2022-02-20T04:43:15+05:30 IST

వైవీయూనివర్శిటీలో గురుకుల భవనాల్లో ఉన్న కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ భవనాలను శనివారం వీసీ సూర్యకళావతి, రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌లు సంయుక్తంగా ప్రారంభించారు.

వైవీయూలో కంప్యూటర్‌ సైన్స్‌ భవనాలు అందుబాటులోకి: వీసీ

కడప వైవీయూ, ఫిబ్రవరి 19: వైవీయూనివర్శిటీలో గురుకుల భవనాల్లో ఉన్న కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ భవనాలను శనివారం వీసీ సూర్యకళావతి, రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌లు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ సూర్యకళావతి మాట్లాడుతూ విశాలమైన తరగతి గదుల్లో విద్యార్థులు చక్కగా చదువుకునే సదుపాయం గురుకుల భవనాల్లో ఉందన్నారు. అలాగే ఎంకాం విభాగం గ్రంథాలయం అందుబాటులోకి తెచ్చామని, వీసీ అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌, ప్రిన్సిపల్‌ కృష్ణారెడ్డి, ఎంసీఏ విభాగం అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Read more