గడువులోగా పనులు పూర్తి చేయండి

ABN , First Publish Date - 2022-10-07T04:43:23+05:30 IST

డ్రాఫ్ట్‌ అర్‌వోఆర్‌ పబ్లికేషన్‌, వెరిఫికేషన్‌ ఈనెల 15వ తేదీ నాటికి 2 వేల గ్రామాల్లో పూర్తి కావాలని కలెక్టర్లను సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఆదేశించారు.

గడువులోగా పనులు పూర్తి చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి


రాయచోటి (కలెక్టరేట్‌), అక్టోబరు 6: డ్రాఫ్ట్‌ అర్‌వోఆర్‌ పబ్లికేషన్‌, వెరిఫికేషన్‌ ఈనెల 15వ తేదీ నాటికి 2 వేల గ్రామాల్లో పూర్తి కావాలని కలెక్టర్లను సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఆదేశించారు. గురువారం విజయవాడలోని తన కార్యాలయం నుంచి ఆయన సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి వైఎ్‌సఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం (సమగ్ర సర్వే) కార్యాచరణ, అమలు, మ్యుటేషన్‌, కోర్టు కేసులపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. 2 వేల గ్రామాల్లో డ్రాఫ్ట్‌ ఆర్‌ఓఆర్‌ పబ్లికేషన్‌, వెరిఫికేషన్‌ ఈనెల 15వ తేదీ నాటికి పూర్తి కావాలన్నారు. డ్రాఫ్ట్‌ ఆర్‌ఓఆర్‌ అప్లికేషన్‌ అయిన వెంటనే వెరిఫికేషన్‌ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. భూహక్కు పత్రాలు, ప్రింటింగ్‌ ఈనెల 22వ తేదీకి లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలన్నారు. లక్ష్యం మేరకు హద్దు రాళ్లు నాటే ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అధికారులతో మాట్లాడుతూ సమగ్ర భూసర్వే భాగంగా డ్రాఫ్ట్‌, ఫైనల్‌ ఆర్‌వో, హద్దురాళ్లు నాటే ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మ్యుటేషన్‌ దరఖాస్తుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి పెండింగ్‌ లేకుండా క్లియర్‌ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జేసీ తమీమ్‌ అన్సారియా, డీఆర్‌వో సత్యనారాయణ, భూముల సర్వే విభాగం సహాయ సంచాలకులు జయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more