బెదిరిస్తున్నాడంటూ డీటీపై తహసీల్దారుకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-10-02T05:03:25+05:30 IST

తమకు చెందిన భూమిరికార్డులు తారుమారు చేయడ మే కాకుండా వాటి గురించి ప్రశ్నించి నందుకు తమను అంతం చేస్తానం టూ బెదిరిస్తున్నాడని పీలేరు డిప్యూటీ తహసీల్దారు కిరణ్‌పై పలువురు పీలే రు తహసీల్దారు రవికి ఫిర్యాదు చేశా రు.

బెదిరిస్తున్నాడంటూ డీటీపై తహసీల్దారుకు ఫిర్యాదు
తహసీల్దారుకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు

పీలేరు, అక్టోబరు 1: తమకు చెందిన భూమిరికార్డులు తారుమారు చేయడ మే కాకుండా వాటి గురించి ప్రశ్నించి నందుకు తమను అంతం చేస్తానం టూ బెదిరిస్తున్నాడని పీలేరు డిప్యూటీ తహసీల్దారు కిరణ్‌పై పలువురు పీలే రు తహసీల్దారు రవికి ఫిర్యాదు చేశా రు. పీలేరు మండలం బోడుమల్లువా రిపల్లె పరిధిలోని సర్వే నెం.904-3లో తమకు 1.60 ఎకరాల డీకేటీ భూమిని డీటీ కిరణ్‌, అతని సోదరుడు పి.యర్రయ్య కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పీలే రు కోటపల్లెకు చెందిన ఎం.వెంకటరమణ, ఎం.మల్లికార్జున, ఎం.శ్రీనివాసులు తహసీల్దా రు దృష్టికి తీసుకెళ్లారు.  తమ భూమిని సర్వే చేయించి  న్యాయం చేయాలని వారు కోరారు. రికార్డులు పరిశీలించి తగిన న్యాయం చేస్తామని తహసీల్దారు తెలిపారు. 


Updated Date - 2022-10-02T05:03:25+05:30 IST