ప్రచార రథాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-20T05:15:04+05:30 IST

రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజాపోరు చైతన్య రథాలను బీజేపీ రాజంపేట పార్లమెంట్‌ ఇన్‌చార్జి సాయిలోకేష్‌ అధ్వర్యంలో వారి స్వగృహం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ సోమవారం నుంచి పార్లమెంట్‌ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఈ ప్రచార రథాల ద్వారా ప్రచారం చేస్తామని ఆయన వెల్లడించారు.

ప్రచార రథాలు ప్రారంభం
జెండా ఊపి ప్రచార రథాలను ప్రారంభిస్తున్న దృశ్యం

రాజంపేట, సెప్టెంబరు 19: రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజాపోరు చైతన్య రథాలను బీజేపీ రాజంపేట పార్లమెంట్‌ ఇన్‌చార్జి సాయిలోకేష్‌ అధ్వర్యంలో వారి స్వగృహం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ సోమవారం నుంచి పార్లమెంట్‌ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఈ ప్రచార రథాల ద్వారా ప్రచారం చేస్తామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో రాజంపేట అసెంబ్లీ ఇన్‌చార్జి పోతుగుంట రమే్‌షనాయుడు, చిట్వేలి మాజీ సర్పంచ్‌ సుబ్బరాయుడు, మైనార్టీ నాయకులు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్‌ అహమ్మద్‌, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.సురే్‌షరాజు తదితరులు పాల్గొన్నారు.  

Read more