కడప ఉక్కు సాధనకు కలిసి రండి

ABN , First Publish Date - 2022-11-24T23:11:18+05:30 IST

కడప ఉక్కు పరిశ్రమ సాధన దిశ గా సీపీఐ చేపడుతున్న ఉద్యమానికి కలిసి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య రాజకీయపార్టీలు, ప్రజాసంఘా లు, యువత, మేధావి వర్గాలకు విజ్ఞప్తి చేశారు.

కడప ఉక్కు సాధనకు కలిసి రండి
సమావేశంలో మాట్లాడుతున్న ఈశ్వరయ్య

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీపీఐ పిలుపు

ప్రొద్దుటూరు క్రైం, నవంబరు 24: కడప ఉక్కు పరిశ్రమ సాధన దిశ గా సీపీఐ చేపడుతున్న ఉద్యమానికి కలిసి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య రాజకీయపార్టీలు, ప్రజాసంఘా లు, యువత, మేధావి వర్గాలకు విజ్ఞప్తి చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో గురువారం పద్మశాలీ కల్యాణ మండపంలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం సీపీఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ సంక్షేమాలను ఓటుబ్యాంకుగా భావిస్తూ పరిపాలన సాగిస్తున్నాడన్నారు. జిల్లాకు ఉక్కు పరిశ్రమ సాధన కోసం మలిదశ పోరాటానికి సీపీఐ సిద్దమవుతోందన్నారు.

టీడీపీ నేత సీఎం సురే్‌షనాయుడు, కడప పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి మాట్లాడుతూ అరాచక పాలన సాగిస్తు న్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, తనను తాను కాపాడుకునేందుకు, అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు మోదీకి సహకారం అందించడమే సరిపోయిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీఎండీ నజీర్‌, టీడీపీ జమ్మలమడుగు ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి, విరసం నాయకురాలు వరలక్ష్మి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు వీఎ్‌సముక్తియార్‌, పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. సాహితీవేత్త జింకా సుబ్రహ్మణ్యం, సృజన శ్రీను, పరిరక్షణ వేదిక నేతలు ప్రతా్‌పరెడ్డి, ప్రైవేట్‌స్కూల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లేటి ప్రభాకర్‌రెడ్డి, ఆర్టీపీపీ నేతలు శివయ్య, గంగాధర్‌ తదితరులు పూర్తి మద్దతును తెలియజేస్తున్నామన్నారు.

Updated Date - 2022-11-24T23:11:18+05:30 IST

Read more