‘సీఎం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి’

ABN , First Publish Date - 2022-11-16T23:34:20+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, వాటి అమలుకు ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని ఏపీమున్సిపల్‌ వర్కర్స్‌ రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు నాగేంద్రబాబు, విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ పట్టణ 6వ మహాసభలు స్థానిక సుందరయ్య భవనంలో నిర్వహించారు.

‘సీఎం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి’

బద్వేలు, నవంబరు 16: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, వాటి అమలుకు ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని ఏపీమున్సిపల్‌ వర్కర్స్‌ రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు నాగేంద్రబాబు, విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ పట్టణ 6వ మహాసభలు స్థానిక సుందరయ్య భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. సమస్యల పరిష్కారానికై పోరాటాలు ఉధృతం చేసి ఫిట్‌మెంట్‌ కోసం కార్మికుల పెంపునకు ఐక్య పోరాటాలు నిర్వహించాలని వారుపిలుపునిచ్చారు. యూనియన్‌ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, శివకుమార్‌, కార్యనిర్వాహణ అధ్యక్షులు హరి, ఉపాధ్యక్షురాలు దేవమ్మ, కార్యదర్శులు నాగేంద్రబాబు, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T23:34:34+05:30 IST

Read more