ఇరువర్గాల గొడవ... ఒకరు మృతి

ABN , First Publish Date - 2022-10-13T05:06:39+05:30 IST

స్థానిక కాపువీధిలో ఎదురెదురు ఇళ్లలో నివాసం ఉండే వారి మధ్య కాల్వలో వ్యర్థాలు వేసే విషయంలో జరిగిన గొడవలో వర్దిరెడ్డి చిన్నసుబ్బారెడ్డి (75) అనే వ్యక్తి మృతి చెందాడు.

ఇరువర్గాల గొడవ... ఒకరు మృతి
వర్ధిరెడ్డి చిన్నసుబ్బారెడ్డి మృతదేహం

బద్వేలు రూరల్‌, అక్టోబరు 12 : స్థానిక కాపువీధిలో ఎదురెదురు ఇళ్లలో నివాసం ఉండే వారి మధ్య కాల్వలో వ్యర్థాలు వేసే విషయంలో జరిగిన గొడవలో వర్దిరెడ్డి చిన్నసుబ్బారెడ్డి (75) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. వర్ధిరెడ్డి చిన్నసుబ్బారెడ్డి ఎదురిం టిలో నివాసం ఉంటున్న రామసుబ్బమ్మ, లక్ష్మీదేవిలు ఇరువురూ బంధువులే. అయితే ఇంటి ముందు మురు గు కాల్వలో వ్యర్థాలు వేసే విషయమై బుధవారం వివా దానికి దారి తీసింది. దీంతో వర్ధిరెడ్డి రామసుబ్బమ్మ, లక్ష్మిదేవిలు వర్ధిరెడ్డి చిన్నసుబ్బారెడ్డిపై దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి కుమారుడు సుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు అర్బన్‌ పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి త రలించారు.

 

Read more