సీసీ కెమెరాల నిఘాలో నగర ప్రధాన వీధులు: డీఎస్పీ

ABN , First Publish Date - 2022-09-30T05:30:00+05:30 IST

నగరంలో అత్యంత రద్దీ ప్రాంతాలైన వైవీ సీ్ట్రట్‌, బీకేఎం సీ్ట్రట్‌లు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయని డీఎస్పీ వెంకటశివారెడ్డి పేర్కొన్నారు.

సీసీ కెమెరాల నిఘాలో నగర ప్రధాన వీధులు: డీఎస్పీ
మాట్లాడుతున్న డీఎస్పీ వెంకటశివారెడ్డి

కడప(మారుతీనగర్‌), సెప్టెంబరు 30: నగరంలో అత్యంత రద్దీ ప్రాంతాలైన వైవీ సీ్ట్రట్‌, బీకేఎం సీ్ట్రట్‌లు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయని డీఎస్పీ వెంకటశివారెడ్డి పేర్కొన్నారు. ది కడప జ్యువెలరీ అసోసియేషన, స్వర్ణకారుల సం క్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 21 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక వైవీసీ్ట్రట్‌, బీకేఎం సీ్ట్రట్‌ నాలుగురోడ ్ల కూడలిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 21 సీసీ కెమెరాలను ఆయన బటన నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల స్వర్ణకారుల దుకాణాలకు పటిష్ట రక్షణ ఉంటుందన్నారు. ఎలాంటి నేరమైనా సీసీ కెమెరాలు పట్టిస్తాయన్నారు. బంగారు దుకాణాలే కాకుండా బట్టల షాపులు, ఫ్యాన్సీషాపుల్లో దొంగతనాలు జరుగకుండా సీసీ కెమెరాలు దోహదపడతాయన్నారు. ఎక్కడ ఏమి జరిగినా పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో గల సీసీ కెమెరాల ద్వారా రికార్డ్‌ అయి మాకు కనిపిస్తుందన్నారు. ఎక్కడ ఇబ్బంది జరిగినా మూడు నిమిషాలలో 30 మంది పోలీసులు మీ ముందుంటారని హెచ్చరించారు. కావున దుకాణదారులకు ఎలాంటి భయమక్కరలేదని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ది కడప జ్యువెలరీ అసోసియేషన అధ్యక్షుడు రాజమోహన, గౌరవాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, సయ్యద్‌ సలావుద్దీన, కార్యదర్శి చానబాష, సంయుక్త కార్యదర్శి గోవిందు నాగరాజు, కోశాధికారి రాఘవ, ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-30T05:30:00+05:30 IST