పిల్లల చదువు భారం కాకూడదు

ABN , First Publish Date - 2022-03-16T05:30:00+05:30 IST

పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్‌ వి.విజయరామరాజు అన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్సు ద్వారా గత ఏడాది అక్టోబరు, డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యాదీవెన లబ్ధి మొత్తాన్ని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమచేశారు.

పిల్లల చదువు భారం కాకూడదు

71,829 మంది విద్యార్థులకు రూ.47.43 కోట్లు జమ

కలెక్టర్‌ వి.విజయరామరాజు

కడప(కలెక్టరేట్‌), మార్చి 16: పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్‌ వి.విజయరామరాజు అన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్సు ద్వారా గత ఏడాది అక్టోబరు, డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యాదీవెన లబ్ధి మొత్తాన్ని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమచేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్‌ హాలు నుంచి కలెక్టర్‌తో పాటు జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి, నగర మేయర్‌ సురేశ్‌బాబు, అనుడా చైర్మన్‌ గురుమోహన్‌, జేసీ సీఎం సాయికాంత్‌ వర్మ హాజరయ్యారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లాలోని 71,829 మంది విద్యార్థులకు సంబంధించిన జగనన్న విద్యాదీవెన లబ్ధి మొత్తం రూ.47.43 కోట్ల మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులు సైతం ఉన్నత విద్య చదివే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు.

Read more