అక్షరాస్యత ద్వారా సమాజంలో మార్పు

ABN , First Publish Date - 2022-09-09T04:37:34+05:30 IST

అక్షరాస్యత పెరిగితే సమాజంలో మార్పు వస్తుందని కడప రెవెన్యూ డివిజనల్‌ అధికారి ధర్మచంద్రారెడ్డి తెలిపారు.

అక్షరాస్యత ద్వారా సమాజంలో మార్పు
ప్రపంచ అక్షరాస్యత దినోత్సవంలో మాట్లాడుతున్న ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి

సికెదిన్నె, సెప్టెంబరు 8: అక్షరాస్యత పెరిగితే సమాజంలో మార్పు వస్తుందని కడప రెవెన్యూ డివిజనల్‌ అధికారి ధర్మచంద్రారెడ్డి తెలిపారు. 56వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా చింతకొమ్మదిన్నె మండలం జె.కొత్తపల్లె పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అక్షరాస్య త తక్కువగా ఉండే గ్రామాల్లో, మండలాల్లో నిరక్షరాస్యులను విజ్ఞానంవైపు నడిపించాలన్నారు. వయోజన విద్యాశాఖ జిల్లా ఉపసంచాలకులు మహమ్మద్‌ ఆజాద్‌ మాట్లాడుతూ అక్షరాస్యత కార్యక్రమాలతో క్షేత్రస్థాయిలో అధికారుల సమన్వయంతో ముందుకు తీసుకుపోవాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, అధికారులు ఉద్యమ స్ఫూర్తితో సాగాలన్నారు.  తహసీల్దారు గంగయ్య, ఎంపీడీఓ రవికుమార్‌రెడ్డి, ఎంఈఓ వెంకటరామిరెడ్డి, స్థానిక హెచ్‌ఎం సురేష్‌బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read more