చైన్‌ స్నాచర్‌ అరెస్టు

ABN , First Publish Date - 2022-04-06T05:15:09+05:30 IST

మండల పరిఽధిలోని కొత్తగంగిరెడ్డిపల్లె గ్రామ సమీపంలో చైన్‌ స్నాచర్‌ దుర్గం దివాకర్‌ను మంగళవారం అరెస్టు చేసినట్లు రూరల్‌ సీఐ శ్రీరామ్‌శ్రీనివాస్‌, ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

చైన్‌ స్నాచర్‌ అరెస్టు

పెండ్లిమర్రి, ఏప్రిల్‌ 5 : మండల పరిఽధిలోని కొత్తగంగిరెడ్డిపల్లె గ్రామ సమీపంలో  చైన్‌ స్నాచర్‌ దుర్గం దివాకర్‌ను మంగళవారం అరెస్టు చేసినట్లు రూరల్‌ సీఐ శ్రీరామ్‌శ్రీనివాస్‌, ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. అతని వద్ద నుండి రెండు బంగారు చైన్లు, రెండు ఉంగరాలు, స్వాధీనం చేసుకున్నామని.. వీటి బరువు 78 గ్రాములు  ఉంటుందన్నారు. అత నిపై పెండ్లిమర్రి, జమ్మలమడుగు అర్బన్‌ పోలీ్‌సస్టేషన్‌లో రెండు చీటింగ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు.  బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళుతున్న వృద్ధులను ఇతను ఎంచుకుంటాడు. సచివాలయంలో లోన్లు ఇప్పిస్తానని.. బంగారు ఆభరణాలు ధరించి ఉంటే మీకు లోన్లు ఇవ్వరంటూ వారికి మామమాటలు చెప్పి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

Read more