చాగంటికి గురజాడ పురస్కారమా?

ABN , First Publish Date - 2022-11-30T23:18:54+05:30 IST

అభ్యుదయ భావజాలం కలిగిన కవి గు రజాడ పేరుతో స్థాపించబడిన సంఘం సంప్రదాయ భావాలతో ఆధ్యాత్మిక ప్రవచనాలు వల్లించే చాగంటికి ఇవ్వడం సరి కాదని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్‌రాహుల్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు దేవదత్తం తెలిపారు.

చాగంటికి గురజాడ పురస్కారమా?
క్యాండిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు

జేవీవీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ

కడప (ఎర్రముక్కపల్లె), నవంబరు 30: అభ్యుదయ భావజాలం కలిగిన కవి గు రజాడ పేరుతో స్థాపించబడిన సంఘం సంప్రదాయ భావాలతో ఆధ్యాత్మిక ప్రవచనాలు వల్లించే చాగంటికి ఇవ్వడం సరి కాదని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్‌రాహుల్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు దేవదత్తం తెలిపారు. కడప నగరం అంబేడ్కర్‌ సర్కిల్‌లో బుధవారం జేవీవీ ఆధ్వర్యంలో చాగంటికి గురజాడ అప్పారా వు అవార్డు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు.

దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అన్న ఉత్తమమైన గీతాన్ని అందించిన అభ్యుదయ మహాకవి మతాలన్నీ మాసిపోని జ్ఞానం ఒక్కటే నిలిచిపోదని చెప్పిన మహాకవి పేరున పురస్కారాన్ని ఆధ్యాత్మిక వ్యక్తికి ఇవ్వడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటి సభ్యులు సరస్వతి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటసుబ్బయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, సమత కన్వీనర్‌ పద్మావతి, జిల్లా కార్యదర్శి సునీత, అయ్యవార్‌రెడ్డి, కోశాధికారి సమీర్‌బాష, నగర ఉపాధ్యక్షులు కరీముల్లా, నగర ప్రధాన కార్యదర్శి దివసంత్‌, విద్యాకమిటి కన్వీనర్‌ ఆరోగ్యమేరీతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:18:55+05:30 IST