దసరా ఉత్సవాలను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2022-09-30T05:30:00+05:30 IST

దసరా ఉత్సవాలను జయప్రదం చేయాలని శిల్పారామం పరిపాలనాధికారి శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

దసరా ఉత్సవాలను జయప్రదం చేయండి

కడప (మారుతీనగర్‌), సెప్టెంబరు 30: దసరా ఉత్సవాలను జయప్రదం చేయాలని శిల్పారామం పరిపాలనాధికారి శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. దసరా పర్వదినం సందర్భంగా శి ల్పారామంలో ఈనెల 2, 3, 5 తేదీలలో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. శుక్రవారం స్థానిక స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజులపాటుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో 3ఎం ఛానల్‌ మిస్ఫా మూవీ ప్ర ముఖ కళాకారులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రముఖ టీవీ యాంకర్లు, కమెడియన్లు, టీవీ డ్యాన్స మాస్టర్లచే గొప్ప ప్రదర్శనలు ఉంటాయన్నారు. కావున అందరూ హాజరు కావాలని ఆయన కోరారు.  

Read more