కారు- ద్విచక్ర వాహనం ఢీ

ABN , First Publish Date - 2022-09-14T04:32:21+05:30 IST

మండలంలోని వండాడి గ్రామ పంచాయతీ తూర్పుపల్లె క్రాస్‌ వద్ద రాయచోటి- మదనపల్లె రోడ్డులో కారు- ద్విచక్రవాహనం ఢీకొని ఇరువురికి తీవ్ర గాయాలైనట్లు ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి...

కారు- ద్విచక్ర వాహనం ఢీ

ఇరువురికి తీవ్రగాయాలు

చిన్నమండెం,సెప్టెంబరు 13: మండలంలోని వండాడి గ్రామ పంచాయతీ తూర్పుపల్లె క్రాస్‌ వద్ద రాయచోటి- మదనపల్లె రోడ్డులో కారు- ద్విచక్రవాహనం ఢీకొని ఇరువురికి తీవ్ర గాయాలైనట్లు ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి... రాయచోటి మండలం మాధవరానికి చెందిన నూర్‌అహ్మద్‌  తన స్నేహితుడు మహమ్మద్‌ అక్రమ్‌తో కలిసి తన ఏపీ04 ఏయూ5661పై రాయచోటి నుంచి చిన్నమండెంకు వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఏపీ29 ఏపీ9137 నెంబరు గల కారు రాంగ్‌ రూట్లో వచ్చి ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇరువురికి తీవ్రగాయాలైనట్లు తెలిపారు. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Read more