ప్రశాంతంగా గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు

ABN , First Publish Date - 2022-04-25T05:00:46+05:30 IST

మండలంలోని బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో ఆదివారం జరిగిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు ప్రిన్సిపాల్‌ సునీత తెలిపారు.

ప్రశాంతంగా గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు

గోపవరం, ఏప్రిల్‌ 24 : మండలంలోని బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో ఆదివారం జరిగిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు ప్రిన్సిపాల్‌ సునీత తెలిపారు. 5వ తరగతి ప్రవేశ పరీక్షకు 240 మంది దరఖాస్తు చేసుకోగా 212 మంది హాజరయ్యారని, జూనియర్‌ ఇంటర్‌మీడియట్‌కు 129 మంది దరఖాస్తు చేసుకోగా 112 మంది హాజరైనట్లు ఆమె తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షను  ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. 

Read more