‘రోడ్ల మెయింటెనెన్స చేపట్టకపోతే ఎస్సీ కార్యాలయం ముట్టడిస్తాం’

ABN , First Publish Date - 2022-09-30T05:30:00+05:30 IST

జిల్లాలో రోడ్ల మెయింటెనెన్స చేపట్టకపోతే ఎస్సీ కార్యాలయం ముట్టడిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు.

‘రోడ్ల మెయింటెనెన్స చేపట్టకపోతే ఎస్సీ కార్యాలయం ముట్టడిస్తాం’

కడప(సెవెనరోడ్స్‌), సెప్టెంబరు 30 : జిల్లాలో రోడ్ల మెయింటెనెన్స చేపట్టకపోతే ఎస్సీ కార్యాలయం ముట్టడిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. శుక్రవారం స్థానిక అల్మా్‌సప్టేలోని బ్రిడ్జీని, వినాయకనగర ప్రాంతాలను సీపీఐ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు కడప నగరం నుంచి వెళ్లే వందలాది వాహనాలు ఈ బ్రిడ్జి మీదుగానే పోతున్నాయని, రోడ్లపై నీరు నిలవకుండా చూడాలని పేర్కొన్నారు. గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చి ప్రమాదాలను నివారించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు అప్రమత్తం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి కేసీ బాదుల్లా, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సి.సుబ్రమణ్యం, జి.వేణుగోపాల్‌, నగర కార్యవర్గ సభ్యులు సావంత సుధాకర్‌, మనోహర్‌రెడ్డి, బందెల ఓబయ్య, మునయ్య, పుష్పరాజ్‌,  శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more