గండిని పూడ్చరా?

ABN , First Publish Date - 2022-08-22T04:51:04+05:30 IST

హంద్రీ నీవా కాలువకు గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు గండి పడింది. కానీ దానిని ఇంత వరకు పూడ్చడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

గండిని పూడ్చరా?
గతేడాది నవంబరులో హంద్రీ-నీవా కాలువకు గండిపడిన దృశ్యం (ఫైల్‌ఫొటో)

 ఏడాది కాలంగా పట్టించుకోని అధికారులు

   కాలువకు గండిపడటంతో దెబ్బతిన్న చెరువులు, కల్వర్టు

మదనపల్లె రూరల్‌, ఆగస్టు 21: హంద్రీ నీవా కాలువకు గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు గండి పడింది. కానీ దానిని ఇంత వరకు పూడ్చడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మండలంలోని వలసపల్లె పంచాయతీ గుట్టకిందపల్లె ఎస్‌ఎ్‌స ట్యాంకు సమీపంలో గతేడాది నవంబరు 19న కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతంలోని కొండవంక నుంచి ఉధృతంగా వంకనీళ్లు వచ్చి హంద్రీనీవా కాలువపై పడి గండిపడింది. అయితే ఇంతవరకు హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స అధికారులు కాలువకు పడిన గండిని పూడ్చకుండా వదిలేశారు. గండిపడిన సమయంలో పుంగనూరు రోడ్డు 150 మైలు వద్ద జాతీయ రహదారిలో కల్వర్టు దెబ్బతింది. అదేవిధంగా హంద్రీ-నీవా కాలువ నీళ్లు వచ్చి పడటంతో అక్కడే ఉన్న మొరంపల్లె చెరువు కట్ట సైతం తెగిపోయింది. చెరువు కట్టకు, జాతీయ రహదారిలో కల్వర్టులకు మరమ్మతులు చేయగా హంద్రీనీవాకాలువ గండిని మాత్రం అధికారులు పూడ్చలేదు. ఈ ఏడాది మళ్లీ వర్షాకాలం ప్రారంభమతుండగా, ఓ మోస్తారు వర్షా లు కురిసినా దిగువప్రాంతంలోని చెరువులు తెగిపోయే ప్రమాదమున్నా ఇంతవరకు అధికారులు దీనిని గురించి పట్టించుకోవ డం లేదు. గండిపడినప్పటి నుంచి ఇంతవరకు హంద్రీ-నీవా కాలువలో కృష్ణాజలాలు రాకపోవడంతో అధికారులు అటువైపు చూడలేదు. కనీసం కాలువకు గండిని పూడ్చినా చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసే వర్షాలతో కాలువ గుండా నీళ్లు ప్రవహించే అవకాశం ఉంది. కాగా  మదనపల్లె దాహార్తి తీర్చడానికి నిర్మిస్తు న్న చిప్పిలి, గుట్టకిందపల్లె సమ్మర్‌స్టోరేజి ట్యాంకుల మొరవ పనులను గత మూడేళ్లుగా సంబంధిత ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడంపై ఇప్పటికే మదనపల్లె ప్రజలు విమర్శలు చేస్తున్నారు. హంద్రీ-నీవా కాలువలో కృష్ణాజలాలు రాకపోయినా ఇక్కడ కురిసే వర్షాలతోనే ఎస్‌ఎ్‌స ట్యాంకులు నిండే అవకాశం ఉంది. ఇప్పుడు కనీసం హంద్రీనీవా కాలువకు పడిన గండిని కూడా పూడ్చలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి హంద్రీనీవా కాలువకు పడిన గండిని పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. 

రూ.8 లక్షలతో ప్రతిపాదనలు పంపాం

మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ గుట్టకిందపల్లె సమ్మర్‌ స్టోరేజి ట్యాంకు సమీపంలో గత ఏడాది నవంబరులో గండిపడింది. దీనిపై గండిపడిన చోట మరమ్మతులకు రూ.8 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరులో ఆలస్యమైంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. 

- సురే్‌షబాబు, ఈఈ, హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స 

Updated Date - 2022-08-22T04:51:04+05:30 IST