నొప్పించే పాలనను దించేయండి

ABN , First Publish Date - 2022-09-20T05:16:59+05:30 IST

ప్రజలను నొప్పించే పాలనను వెంటనే దించేయాలని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన రాయచోటి మండల పరిధిలోని మాధవరం గ్రామ పంచాయతీ కస్పాలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ శ్రేణులతో కలిసి నిర్వహించారు.

నొప్పించే పాలనను దించేయండి
మాధవరం కస్పాలో ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్న రమే్‌షకుమార్‌రెడ్డి

మాజీ ఎమ్మెల్యే రమే్‌షకుమార్‌రెడ్డి

రాయచోటిటౌన్‌, సెప్టెంబరు 19: ప్రజలను నొప్పించే పాలనను వెంటనే దించేయాలని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన రాయచోటి మండల పరిధిలోని మాధవరం గ్రామ పంచాయతీ కస్పాలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా పేల్చుతూ, డప్పులతో మహిళలు హారతులతో, గజమాలతో రమే్‌షరెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాధవరం కస్పాలో ఇంటింటి ప్రచారం నిర్వహణలో భాగంగా డీజిల్‌, పెట్రోల్‌, వంట గ్యాస్‌, ఇసుక, నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై వైసీపీ ప్రభుత్వం అధిక భారాన్ని మోపుతున్న విషయాన్ని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, పాల ఏకరి రాష్ట్ర సాధికార సమితి కన్వీనర్‌ శివప్రసాద్‌నాయుడు అలియాస్‌ గుట్టబాబు, తెలుగు యువత మండల అధ్యక్షుడు విశ్వనాధనాయుడు, మాజీ ఎంపీటీసీ హుస్సేన్‌పీరా, రాయచోటి క్లస్టర్‌ ఇన్‌చార్జి రమణారెడ్డి, టీడీపీ యువనాయకుడు దుగ్గనపల్లె వెంకట్రామిరెడ్డి, వాసుదేవ, చలపతినాయుడు, రాయచోటి మండలశాఖ అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. 


Read more