9 నుంచి తాళ్లపాకలో బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-07-06T04:29:25+05:30 IST

పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచా ర్యుల ఇలవేల్పు శ్రీ సిద్దేశ్వర, చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9 నుంచి 19వ తేదీ వరకు జరుగుతాయని టీటీడీ చైర్మన్‌ సుబ్బా రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ప్రకటించారు.

9 నుంచి తాళ్లపాకలో బ్రహ్మోత్సవాలు

15న కళ్యాణోత్సవం 

18న వసంతోత్సవం 

19న పుష్పయాగం

రాజంపేట, జూలై5: పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచా ర్యుల ఇలవేల్పు శ్రీ సిద్దేశ్వర, చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9 నుంచి 19వ తేదీ వరకు జరుగుతాయని టీటీడీ చైర్మన్‌ సుబ్బా రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ప్రకటించారు. 9న వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకు రార్పణ జరుగుతుందని, దీక్ష తిరుమంజనం నిర్వహిస్తారన్నారు. 10న ఉదయం ధ్వజారోహణ, రాత్రి సిద్దేశ్వరస్వామికి హంస వాహనం, చెన్నకేశవస్వామి శేష వాహనంపై ఊరేగుతారన్నారు. 11న ఉదయం పల్లకీసేవ, సాయంత్రం సిద్దేశ్వర స్వామి చంద్రప్రభ వాహనంపై, చెన్నకేశవస్వామి హంస వాహనంపై ఊరేగుతారన్నారు. 12న ఉద యం పల్లకీసేవ, సాయంత్రం సిద్దేశ్వరస్వామి చిన్న శేష వాహనం, చెన్నకేశవస్వామి సింహ వాహనంపై దర్శనమిస్తారన్నారు. 13న ఉద యం పల్లకీ సేవ, సాయంత్రం సిద్దేశ్వరస్వామి సింహవాహనం, చెన్నకేశవస్వామి హనుమంత్‌ వాహనంపై ఊరేగుతారన్నారు. 14న ఉదయం పల్లకీసేవ, సాయంత్రం సిద్దేశ్వరస్వామి నంది వాహనంపై, చెన్నకేశవస్వామి ఉదయం మొహినీ అవతారం, సాయం త్రం గరుడ వాహనంపై ఊరేగుతారన్నారు.

15న కళ్యాణోత్సవాలు జరుగుతాయ న్నారు. 16న రాత్రి సిద్దేశ్వరస్వామి ఆలయంలో పల్లకీసేవ, చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉదయం పల్లకీసేవ, రాత్రికి రధోత్సవం జరుగు తుందన్నారు. 17న సిద్దేశ్వరస్వామి ఆలయంలో ఉద యం పల్లకీసేవ, రాత్రికి పార్వేట ఉత్సవం, చెన్నకేశవస్వామి ఆలయం లో ఉదయం పల్లకీసేవ, రాత్రి అశ్వవాహనంపై ఊరేగుతారన్నారు. 18న సిద్దేశ్వర స్వామి ఆలయంలో ఉదయం వసంతోత్సవం, త్రిశూల స్నానం, రాత్రి ధ్వజావరోహణ చెన్నకేశవస్వామి ఆలయంలో ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణ జరుగుతుందన్నారు. 19న  సిద్దేశ్వర స్వామి, చెన్నకేశవస్వామి ఆలయాల్లో ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం పుష్పయాగం జరుగుతుందన్నారు. అన్నమాచార్య ప్రాజె క్టు, హిందూ ధర్మపరిషత్‌ వారిచే రోజూ హరికథ, సంగీతం, భజన కార్యక్రమాలు ఉంటాయన్నారు. 

Updated Date - 2022-07-06T04:29:25+05:30 IST