ఘనంగా అయ్యప్పస్వామి గ్రామోత్సవం

ABN , First Publish Date - 2022-11-30T23:29:45+05:30 IST

మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీ అరవపల్లె గాంధీనగర్‌కు చెందిన మునయ్య గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి గ్రామోత్సవం బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

ఘనంగా అయ్యప్పస్వామి గ్రామోత్సవం
ప్రత్యేక అలంకరణలో స్వామివారు

నందలూరు, నవంబరు 30: మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీ అరవపల్లె గాంధీనగర్‌కు చెందిన మునయ్య గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి గ్రామోత్సవం బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గాంధీనగర్‌ నుంచి బస్టాండు వరకు కొనసాగిన ఈ గ్రామోత్సవంలో మహిళలు దీపాలు పట్టుకొని ప్రత్యేక ఆకర్శనగా నిలి చారు. చెక్కభజన, భక్తులు నిర్వహించిన నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. గ్రామోత్సవంలో గురుస్వాములు బాలాంజనేయులు, రాజాచారి, గణపతి ఆచారి పెద్దఎత్తున అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:29:45+05:30 IST

Read more