ఆటో బోల్తా -15 మందికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2022-06-07T05:38:31+05:30 IST

అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని నూతిమడుగు క్రాస్‌ వద్ద సోమవారం ఆటో బోల్తా పడి 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆటో బోల్తా -15 మందికి తీవ్రగాయాలు

పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం

బాధితులంతా రాయచోటి వాసులు


కంబదూరు, జూన్‌ 6: అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని నూతిమడుగు క్రాస్‌ వద్ద సోమవారం ఆటో బోల్తా పడి 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా రాయచోటికి చెందిన ఒకే కుటుంబికులు 15 మంది కళ్యాణదుర్గంలో వివాహానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగియగానే తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో నూతిమడుగు క్రాస్‌ సమీపాన అడ్డు వచ్చిన ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి, ఆటో బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న పెద్ద శేషన్న, గంగమ్మ, వెంకటేశులు, తులసి, చిన్నశేషు మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని 108లో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

 

Read more