పెట్రోల్‌తో దాడి : ఒకరికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-02-20T04:37:56+05:30 IST

గుర్తు తెలియని దుండగులు పెట్రోలుతో దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

పెట్రోల్‌తో దాడి : ఒకరికి తీవ్ర గాయాలు

సుండుపల్లె, ఫిబ్రవరి 19: గుర్తు తెలియని దుండగులు పెట్రోలుతో దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.  గ్రామస్థుల వివరాల మేరకు తిమ్మసముద్రం గ్రామం రెడ్డెంపల్లె వాసి గంగోజి సుండుపల్లెలో నివాసముంటున్నాడు. ఈయన శుక్రవారం రాత్రి స్వగ్రామమైన రెడ్డెంపల్లెలో ఉండి శనివారం తెల్లవారుజామున బస్సు ఎక్కే సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆకస్మికంగా పెట్రోల్‌ వేసి నిప్పు పెట్టి పారిపోయారు. ఈ విషయం తెలియడంతో తీవ్రంగా గాయపడ్డ గంగోజిని అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు అక్కడి వైద్యుల సూచన మేరకు తిరుపతి ఆస్పత్రికి తరలించామని ఆయన కుమారుడు ప్రకాష్‌ తెలిపారు. ఈ వ్యవహారంపై తమకు ఎటువంటి ఫిర్యా దు అందలేదని పోలీసులు తెలిపారు.

Read more