8 నుంచి అమృతేశ్వరస్వామి ఆలయంలో అష్టబంధన మహా కుంభాభిషేకం

ABN , First Publish Date - 2022-12-06T23:33:44+05:30 IST

పెన్నానది తీరంలోని అమృతేశ్వరస్వామి ఆలయంలో 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అష్టబంధ న మహాకుంభాభిషేక మహోత్సవాన్ని, అయ్యప్ప స్వామి ఆలయం లో లక్షార్చన నిర్వహిస్తున్నట్లు శ్రీస్వామి అయ్యప్ప దేవస్థాన కమి టీ అధ్యక్షుడు నామా రమేష్‌ బాబు, పీఆర్‌ఓ ధారా సంతోష్‌ తెలిపారు.

8 నుంచి అమృతేశ్వరస్వామి ఆలయంలో అష్టబంధన మహా కుంభాభిషేకం

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 6: పెన్నానది తీరంలోని అమృతేశ్వరస్వామి ఆలయంలో 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అష్టబంధ న మహాకుంభాభిషేక మహోత్సవాన్ని, అయ్యప్ప స్వామి ఆలయం లో లక్షార్చన నిర్వహిస్తున్నట్లు శ్రీస్వామి అయ్యప్ప దేవస్థాన కమి టీ అధ్యక్షుడు నామా రమేష్‌ బాబు, పీఆర్‌ఓ ధారా సంతోష్‌ తెలిపారు. 8న ఉదయం అమ్మవారి శాల నుంచి 108 మంది సుహాసినులతో కుంభాభిషేక కలశాలను ఊరేగింపుగా అమృతేశ్వరస్వామి ఆలయానికి తీసుకువెళతామన్నారు. 9న ఆవాహిత దేవతాహోమాలు, రుద్ర, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పిస్తామన్నారు.

10న నవ చండీ సహిత రుద్రహోమాలు, సామూహిక శివసహస్రనామ బిల్వార్చన నిర్వహిస్తామన్నారు. ఆదివారం మూల మంత్ర హోమాలు నిర్వహించి పూర్ణాహుతి ఉంటుందని తెలిపారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్యలో పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామి ఆధ్వర్యంలో అష్టబంధన మహాకుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 గంటలకు అయ్యప్పస్వామి లక్షార్చన నిర్వహించి అన్నప్రసాదం వినియోగిస్తామన్నారు.

Updated Date - 2022-12-06T23:33:46+05:30 IST