ఆశ కార్యకర్తలను ఉద్యోగులుగా గుర్తించాలి

ABN , First Publish Date - 2022-10-05T05:13:00+05:30 IST

ఆశ కార్యకర్తలను మెడి కల్‌ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

ఆశ కార్యకర్తలను ఉద్యోగులుగా గుర్తించాలి
రామాపురంలో ఆశవర్కర్లతో మాట్లాడుతున్న ఏఐటీయూసీ నేతలు

లక్కిరెడ్డిపల్లె/రామాపురం, అక్టోబరు 4: ఆశ కార్యకర్తలను మెడి కల్‌ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. మంగళవారం దేవళంపల్లె పీహెచ్‌సీలో ఆశకార్యకర్త లతో సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్‌ లీవులు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత ఈఎస్‌ఐ ఈపీఎఫ్‌ సౌకర్యం, మరణిం చిన కార్యకర్తలకు 10 ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.  రామాపురం సీపీఐ మండల కార్యదర్శి చెండ్రాయుడు పాల్గొ న్నారు.  

గాలివీడు: గాలివీడులో ఆశ కార్యకర్తల యూనియన్‌ నాయకు రాలు రామసుబ్బమ్మ అధ్యక్షతన సమావేశం నిర్వ హించారు.  సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ. రామాంజులు, సీఐ టీయూ జిల్లా కమిటీ సభ్యురాలు ఓబులమ్మ, ఆశావర్కర్ల సంఘం మం డల అధ్యక్షురాలు పుష్ప, కార్యదర్శి సుప్రజ, రమణమ్మ, లక్ష్మి దేవి, మల్లేశ్వరి, పరమేశ్వరి, నాగేశ్వరమ్మలతో పాటు పలువురు ఆశవర్కర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-05T05:13:00+05:30 IST