ఆశ కార్యకర్తలకు కనీస వేతనాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-07-06T04:30:12+05:30 IST

ఆశ కార్యకర్తలకు కనీస వేతనా లు ఇవ్వాలని ఏఐ టీయూసీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గంగాధర్‌ తెలిపారు.

ఆశ కార్యకర్తలకు కనీస వేతనాలు ఇవ్వాలి
నిరసన వ్యక్తం చేస్తున్న ఆశా కార్యకర్తలు

ఏఐటీయూసీ డిమాండ్‌

రైల్వేకోడూరు, జూ లై 5: ఆశ కార్యకర్తలకు కనీస వేతనా లు ఇవ్వాలని ఏఐ టీయూసీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గంగాధర్‌ తెలిపారు. మంగళవా రం అనంతరాజుపే ట ప్రాధమిక ఆరో గ్య కేంద్రం ఆవరణలో ఆశ కార్యకర్తల నిరసనలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు కనీస వేతనం రూ. 21వేలు ఇవ్వాలన్నారు. వారిని మెడికల్‌ ఉ ద్యోగులుగా గుర్తించాలన్నారు. అర్హత కల్గిన ఆశా కార్యకర్తలకు ఏఎన్‌ఎంలు గా పదోన్నతి కల్పించాలన్నారు. కరోనాతో మృతి చెందిన కార్యకర్తలకు కేం ద్రం ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం ఇన్సూ రెన్స్‌ రూ. 50 లక్షలు చెల్లించి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Read more