ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

ABN , First Publish Date - 2022-07-05T23:33:48+05:30 IST

కడప: కడప జిల్లా వ్యాప్తంగా ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. అంతరాష్ట్ర స్మగ్లర్ ఫకృద్దీన్‌తో పాటు ఏడుగురు స్మగ్లర్లు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.45 వేలు నగదు, 2 టన్నుల బరువున్న 55

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

కడప: కడప జిల్లా వ్యాప్తంగా ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. అంతరాష్ట్ర స్మగ్లర్ ఫకృద్దీన్‌తో పాటు  ఏడుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.45 వేలు నగదు, 2 టన్నుల బరువున్న 55 ఎర్రచందనం దుంగలు, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ అన్బురాజన్  స్మగ్లర్ల వివరాలు వెల్లడించారు. చాపాడు మండలం ఖాదర్ పల్లెకు చెందిన ఫకృద్దీన్, లాల్ బాషా, జాకీర్, లతీఫ్ గ్యాంగ్‌గా ఏర్పడి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని, అన్నమయ్య జిల్లా సానిపాయ అటవీ ప్రాంతం నుంచి ఖాజీపేట, మైదుకూరు మీదుగా దుంగలను తరలిస్తున్నారని ఎస్పీ చెప్పారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన తిరుపతి, రామన్, శివబాబు వెంట తమిళ కూలీలను లంకమల, శేషాచలం అటవీ ప్రాంతాలకు తరలించి చెట్లను నరికిస్తారని తెలిపారు. దుంగలను ఢిల్లీ, కటిగినహల్లి‌కి చెందిన సలీం, జమీర్‌లకు అమ్మారని ఎస్పీ వెల్లడించారు. 

Read more